రేవంత్ రెడ్డి.. అధికారం శాశ్వతం కాదు వడ్డీతో సహా చెల్లిస్తాం: కేటీఆర్ ధ్వజం

తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల సమయంలో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. తాజాగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదు తిరిగి వడ్డీతో సహా చెల్లిస్తామని కాంగ్రెస్ పార్టీకి హెచ్చరికలు జారీ చేశారు.

అది ఫేక్ అయితే చంచల్ గూడా జైలుకు వెళ్తా : కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డి చేతిలో అధికారం ఉందని బీఆర్ఎస్ నేతలపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపిస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఓయూ ఫేక్ సర్క్యులర్ వ్యవహారంలో బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అరెస్టు పైన ఆయన స్పందించారు.క్రిశాంక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సర్కులర్ ఫేక్ సర్క్యులర్ అయితే తాను చంచల్ కూడా జైలుకు వెళ్లడానికి సిద్ధమని కేటీఆర్ పేర్కొన్నారు.

KTR shocking comments on Revanth Reddy on krishank arrest said Power is not permanent

వడ్డీతో సహా చెల్లిస్తాం
బీఆర్ఎస్ శ్రేణులకు కేసులు కొత్తేమీ కాదని ఎన్ని కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటామని తమది ఉద్యమ పార్టీ అని కేటీఆర్ స్పష్టం చేశారు. అధికారం శాశ్వతం కాదని, తాము కూడా తప్పకుండా బదులు చెప్పి తీరుతామని , వడ్డీతో సహా చెల్లించే సమయం వస్తుందని కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ పై ఓ పనికిమాలిన కేసు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తుందన్నారు.

దమ్ముంటే నువ్వు ఆ పని చెయ్ రేవంత్ రెడ్డి
అసలు తప్పు చేసిన రేవంత్ రెడ్డి జైల్లో ఉండాల్సింది పోయి బయట తిరుగుతున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు పెట్టిన సర్క్యులర్, క్రిశాంక్ పెట్టిన సర్క్యులర్ ను నిపుణుల ముందు పెడదామని ఏది ఒరిజినల్ ఏది డూప్లికేటో తేలుద్దామని ఆ తర్వాత ఎవరు చంచల్ కూడా జైల్లో ఉండాలో తేలిపోతుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

రేవంత్ రెడ్డి సిగ్గు తెచ్చుకో
చెయ్యని తప్పుకు క్రిషాంక్ ను జైల్లో పెట్టారనీ, ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేశారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇకనైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిగ్గు తెచ్చుకొని చేసిన తప్పును సరిదిద్దుకోవాలని హితవు పలికారు. తెలంగాణ సర్కార్ చేసిన వెధవ పనికి వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తప్పు చేయని క్రిశాంక్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+