అప్పుడు పూలదండలు! ఇప్పుడు పక్కనే..: బిల్కిస్ బానో దోషి ఫొటోలపై కేటీఆర్ సెటైర్లు
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీపై తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీ అంటే బలాత్కార్ జస్టిఫికేషన్ పార్టీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బిల్కిస్ బానో రేప్ కేసు దోషులతో బీజేపీ నేతలు సన్నిహితంగా ఉండటం ఆ పార్టీ విధానాలను తెలియజేస్తుందని కేటీఆర్ ట్విట్టర్ వేదిగా విమర్శలు గుప్పించారు.
బిల్కిస్ బానో దోషులు విడుదలైనప్పుడు వారిని బీజేపీ నేతలు సత్కరించి సంబరాలు చేసుకున్నారని.. ఇప్పుడు ఆ దోషులు ప్రజాప్రతినిధులతో వేదికను పంచుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలు పెట్టిన ట్వీట్‌ను రీట్వీట్ చేశారు కేటీఆర్. ఈ సందర్భంగా బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బీఆర్ఎస్ నేతలు కూడా ఆ బీజేపీ నేతల తీరుపై మండిపడుతున్నారు.

కాగా, శనివారం గుజరాత్ రాష్ట్రంలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో బీజేపీ ప్రతినిధులతో కలిసి బిల్కిస్ బానో కేసు దోషుల్లో ఒకరైన శైలేష్ చిమన్ లాల్ భట్ పాల్గొన్నాడు. దాహోద్ జిల్లా కర్మాడి గ్రామంలో జరిగిన అతడు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి వేదికపై కూర్చున్నాడు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలోనూ పాల్గొన్నాడు.
Welcome to #AmritKaal
— KTR (@KTRBRS) March 27, 2023
Balatkaar Justification Party and it’s Brazen embrace of these rapists is a true reflection of their mindset https://t.co/EBdkfkDbzr
అయితే, ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారు. కేటీఆర్ కూడా ఈ ఫొటోలు ట్వీట్ చేసి విమర్శలు గుప్పించారు.
బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులను గత ఆగస్టు 15 సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం రెమిషన్ పై విడుదల చేసింది. దీంతో దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. వీరి విడుదలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. అయితే, దోషులు ఇలా ప్రభుత్వ కార్యక్రమాల్లో కనిపించడం, ప్రజాప్రతినిధులతో దర్శనమివ్వడం విమర్శలుకు తావిస్తోంది.












Click it and Unblock the Notifications