మరో బుల్డోజర్ల రాజ్ చేయొద్దు: పేదలపై ప్రతాపమా? అంటూ ఖర్గేకు కేటీఆర్
తెలంగాణను మరో బుల్డోజర్ రాజ్‌గా మార్చవద్దని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. మహబూబ్‌నగర్ పట్టణంలోని పేదల ఇళ్ల కూల్చివేతలపై కేటీఆర్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా స్పందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం, చట్టాలనూ ఉల్లంఘిస్తూ పేదలకు గూడు లేకుండా చేసే ప్రయత్నాన్ని మీరు సమర్థిస్తున్నారా? అని మల్లిఖార్జున ఖర్గేను కేటీఆర్ ప్రశ్నించారు.
పేదల ఇళ్లను కూల్చకుండా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించాలని ఖర్గేను కోరారు కేటీఆర్. ఒకరి ఇంటిని కూల్చివేసి వారి కుటుంబాన్ని నిరాశ్రయులుగా మార్చటం అమానవీయం. అన్యాయం అంటూ గతంలో మీరే అన్నారని ఖర్గేను ఎక్స్‌లో ట్యాగ్ చేస్తూ కేటీఆర్ ప్రస్తావించారు. కాంగ్రెస్ అధినేత ఖర్గే మాటలను గుర్తు చేస్తూ ప్రశ్నించిన కేటీఆర్.. తెలంగాణలో చట్టాన్ని ఉల్లంఘిస్తూ పేదల జీవితాలను ఆగం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇప్పుడు రాష్ట్రంలో పేదల ఇళ్లను అదే విధంగా కూల్చేస్తూ ఆ కుటుంబాలను నిరాశ్రయులు చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మీ సమాధానం ఏమిటి? అంటూ మల్లిఖార్జున ఖర్గేను కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు.
మహబూబ్‌నగర్ పట్టణంలోని 75 మంది పేదల ఇళ్లను తెల్లవారుజామున 3 గంటలకు ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చివేసిన సంఘటనను ఆయన దృష్టికి తీసుకెళ్లారు కేటీఆర్. మీ(కాంగ్రెస్) ప్రభుత్వం కూల్చేసిన 75 కుటుంబాల ఇళ్లలో 25 కుటుంబాలు వికలాంగులకు చెందినవేనని ఖర్గేకు తెలిపారు. ఎలాంటి చట్టపరమైన ప్రక్రియ అనుసరించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరికాదనీ, ఆధునిక సమాజంలో ఇలాంటి ఆటవిక వ్యవహారాలు ఏమాత్రం మంచివి కావని కేటీఆర్ హితవు పలికారు.
Dear Kharge Ji,
— KTR (@KTRBRS) August 30, 2024
As you said, demolishing someone’s home and rendering their family homeless is both inhumane and unjust
This is exactly what is happening in Telangana with utter contempt for law & judiciary. Below is a video of Mahbubnagar town where 75 houses of poor have been… https://t.co/HlneWWBVlj pic.twitter.com/8qJJeeDQ45
40 ఏళ్ల కిందట, 20 ఏళ్ల క్రితం ఇళ్లు కట్టుకొని నివాసం ఉన్న పేదల ఇళ్లను ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చేస్తుండటం, ఎంత అమానవీయామో ఖర్గే చెప్పాలన్నారు. పేదలు, వికలాంగుల ఇళ్లను కూలగొట్టటమా? ఇదెక్కడి న్యాయం? అంటూ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని మరో "బుల్డోజర్ రాజ్" కాకుండా మీ పార్టీ ప్రభుత్వానికి సూచన చేయలంటూ ఖర్గేకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. నివాసాలు కూల్చడంతో కన్నీరుపెట్టుకుంటున్న పేదలు, వారి పిల్లలకు సంబంధించిన వీడియోను కేటీఆర్ తన ట్వీట్‌కు జతచేశారు.












Click it and Unblock the Notifications