అభివృద్ధి అంటే కుర్ కురే ప్యాకెట్లు పంచటం కాదు: కిషన్ రెడ్డికి కేటీఆర్ చురకలు!!

మంత్రి కేటీఆర్ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేక కిషన్ రెడ్డి తత్తర బిత్తర మాట్లాడి పరువు తీసుకోవడాన్ని అలవాటుగా చేసుకున్నారని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డి కళ్ళుండీ చూడలేని పరిస్థితిలో ఉన్నారంటూ కేటీఆర్ విమర్శలు గుప్పించారు.

హైదరాబాద్ నగరం నలుమూలల అభివృద్ధి సాధిస్తూ ఉంటే కిషన్ రెడ్డి మాత్రం చూడలేక ఓర్వలేక అసత్యాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరాభివృద్ధికి ఒక పైసా కూడా అదనంగా తీసుకురాలేని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిలో కేంద్రం వాటా ఎంతో ప్రజలకు వివరిస్తే బాగుంటుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణా సొమ్ము తింటూ నరేంద్ర మోడీ పాట పాడుతున్న కిషన్ రెడ్డి : కేటీఆర్

తెలంగాణా సొమ్ము తింటూ నరేంద్ర మోడీ పాట పాడుతున్న కిషన్ రెడ్డి : కేటీఆర్

కిషన్ రెడ్డి తెలంగాణ సొమ్ము తింటూ నరేంద్రమోడీ పాట పాడుతున్నారని ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్.వరదలతో అతలాకుతలమైన హైదరాబాద్ కు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా నిధులు తీసుకురాలేని అసహాయ మంత్రిగా కిషన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. మాటలు మాట్లాడటం ఆపి దమ్ముంటే కేంద్రం నుంచి నిధులు తీసుకు రావాలని సవాల్ విసిరారు. తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నిధులు, సంస్థలను సొంత రాష్ట్రం గుజరాత్ కు తరలించుకు పోయిన ప్రధానమంత్రిని కిషన్ రెడ్డి ఎందుకు ఇదేమిటి అని అడగలేకపోతున్నాడో చెప్పాలని ధ్వజమెత్తారు.

సొంత నియోజకవర్గానికే కిషన్ రెడ్డి ఏమీ చెయ్యలేదు.. మా గురించి మాట్లాడతారా?

సొంత నియోజకవర్గానికే కిషన్ రెడ్డి ఏమీ చెయ్యలేదు.. మా గురించి మాట్లాడతారా?

రాజకీయాలకతీతంగా తాము చేస్తున్న అభివృద్ధి పనులకు అనేక నిదర్శనాలు ఉన్నాయని చెప్పిన మంత్రి కేటీఆర్ కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఏ మాత్రం అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన సికింద్రాబాదులో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేసిన అభివృద్ధి ఏమిటో చూపించాలని, తన సొంత నియోజకవర్గానికి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్ అభివృద్ధిలో తాము చేస్తున్న పనుల లెక్క చెప్పిన కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వం నగరంలోని అన్ని ప్రాంతాలకు సమాన ప్రాధాన్యం ఇస్తుందని కిషన్ రెడ్డి తెలుసుకోవాలన్నారు.

మీరు చేసిన అభివృద్ధి ఇదేనా?

మీరు చేసిన అభివృద్ధి ఇదేనా?

ఐటీ, పారిశ్రామిక, ఫార్మా, సర్వీసెస్ రంగాలను నగరంలోని అన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేస్తూ అభివృద్ధిని కొనసాగిస్తున్నామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇప్పటివరకు కిషన్ రెడ్డి చేసిన పనులను గురించి మాట్లాడుతూ సెటైర్లు వేసిన మంత్రి కేటీఆర్ ప్యాసింజర్ లిఫ్ట్ లను ప్రారంభించడం కుర్కురే ప్యాకెట్ లను పంచడమే అభివృద్ధి అనుకుంటున్న కేంద్రమంత్రి మాటలు బంద్ చేసి హైదరాబాద్ కు నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ కు అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వని మోడీ ప్రభుత్వానికి, కిషన్ రెడ్డికి తనను విమర్శించే హక్కు లేదని మంత్రి కేటీఆర్ తేల్చిచెప్పారు.

అసమర్థత కప్పి పుచ్చుకోవటానికి తమపై నిందలు

అసమర్థత కప్పి పుచ్చుకోవటానికి తమపై నిందలు

సొంత నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అంబర్ పేట ప్లైఓవర్ పనులు మూడేళ్ల నుండి కొనసాగుతూనే ఉన్నా కిషన్ రెడ్డి ఇప్పటి వరకూ పట్టించుకోలేదని కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. తన అసమర్ధతను కప్పిపుచ్చుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం పై నిందలు వేయడం అజ్ఞానం, అవగాహనారాహిత్యం అంటూ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. కిషన్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+