దావోస్ చేరుకున్న మంత్రి కేటీఆర్, ఎన్నారైల ఘన స్వాగతం

హైదరాబాద్: తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఆయన స్విట్జర్లాండ్ వెళ్లారు. ఆయనకు ఎన్నారైలు ఘన స్వాగతం పలికారు. ఆదివారం జ్యూరిచ్ నగరంలో పలు సమావేశాలకు కేటీఆర్ హాజరు కానున్నారు.

ఈ నెల 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పలు కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్ సమావేశం అవుతారు.

ఈ నెల 23 నుంచి 26 వరకు దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు ప్రధాని మోడీతో ప్రపంచంలోని వందకుపైగా దేశాల నుంచి అగ్రశ్రేణి కంపెనీ సీఈవోలు, నిర్వాహకులు, 2500 ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ సదస్సులో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర బృందానికి మంత్రి కేటీఆర్ నాయకత్వం వహిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+