పారిశ్రామికవేత్తలకు కేటీఆర్ పిలుపు
హైదరాబాద్: కొత్తరాష్ట్రం తెలంగాణ అన్ని వర్గాల భాగస్వామ్యంతో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. తెలంగాణ అభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు యువ పారిశ్రామికవేత్తలు ముందుకురావాలని పిలుపునిచ్చారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అనుబంధసంస్థ యంగ్ ఇండియన్స్ గురువారం హైదరాబాద్‌లో తెలంగాణ పరివర్తన క్రమం అనే అంశంపై ఒక సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులో కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ విభిన్న వర్గాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ముందుకు సాగుతుందని తెలిపారు.












Click it and Unblock the Notifications