వైఫల్యాలను ఎత్తిచూపి రేవంత్ సర్కార్ ను ఉక్కిరిబిక్కిరి చేసే పనిలో కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ పనితీరు పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ కాంగ్రెస్ హయాంలో అస్తవ్యస్తంగా మారిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యారంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా బ్రష్టు పట్టించిందని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారింది: కేటీఆర్
గురుకుల పాఠశాల, కళాశాలల భవనాలకు అద్దె చెల్లించడం లేదని, కాలేజీల యాజమాన్యాలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదని, కనీసం పాఠశాలల్లో అన్నం పెట్టలేని స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారిందని కేటీఆర్ మండిపడ్డారు. విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసే దుస్థితి తీసుకువచ్చారని అసహనం వ్యక్తం చేశారు.

KTR suffocating Revanth govt by pointing out the failures in fee reimbursement and scholarships

ఫీజు రీయింబర్స్మెంట్ లు, స్కాలర్ షిప్ లు చెల్లించకపోతే ఎలా
రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, పీజీ ప్రైవేట్ కళాశాలలను నిరవధికంగా మూసివేయడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. విద్యార్థులకు ఇవ్వవలసిన ఫీజు రీయింబర్స్మెంట్ లు, స్కాలర్ షిప్ లు చెల్లించకపోతే వారి చదువు ఎలా సాగుతుందంటూ ప్రశ్నించారు. పేద విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నారని, విద్యార్థుల చదువులకు డబ్బులు ఖర్చు పెట్టలేరా అంటూ నిలదీశారు.

మూసీ కోసం ఖర్చు చేస్తారు కానీ విద్యార్థుల కోసం ఇవ్వరా
మూసి కోసం లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసే కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర అద్దెలు ఫీజు రీయింబర్స్మెంట్లు స్కాలర్షిప్ లు ఇవ్వడానికి డబ్బులు లేవా అని నిలదీశారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో సీఎం రేవంత్ రెడ్డి చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాల్సింది పోయి విద్యార్థుల శ్రేయస్సును పక్కనపెట్టి ఢిల్లీకి డబ్బుల మూటలు పంపించే పనిలో ముఖ్యమంత్రి బిజీగా ఉన్నాడని ఆరోపించారు.

విద్యార్థులకు అన్యాయం చేస్తే సహించేది లేదు
రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడని, ముఖ్యమంత్రికి విద్యారంగంలో ఉన్న సమస్యలను తెలుసుకునే ఓపిక కూడా లేదని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కాలేజీలు నిరవేదికంగా బంద్ చేస్తామని హెచ్చరించినా, తెలంగాణ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నష్టం చేయకుండా వెంటనే ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని స్కాలర్షిప్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు అన్యాయం చేస్తే బిఆర్ ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+