• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేటిఆర్ ప్రతిభావంతుడైన మంత్రి.!నిత్య కృషీ వలుడనే పుస్తకాన్నావిష్కరించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఐటి మంత్రి కల్వకుంట్ల తారక రామారావు దేశంలోనే అత్యంత ప్రతిభావంతుడైన మంత్రని, కేటీఆర్ అంటే యూత్ ఐకాన్ అని, నేటి యువతకు ఆదర్శం ఆయన నడవడిక అని రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించడంలో కేటీఆర్ ది ముఖ్య పాత్ర అని మంత్రి కొనియాడారు. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా విజయవంతంగా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేటీఆర్ కు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా కేటీఆర్ నిత్య కృషీవలుడు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు మంత్రి ప్రశాంత్ రెడ్డి.

వర్కింగ్ ప్రసిడెంట్ గా కేటీఆర్ మూడేళ్లు పూర్తి.. నిత్యకృషీ వలుడనే పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి

వర్కింగ్ ప్రసిడెంట్ గా కేటీఆర్ మూడేళ్లు పూర్తి.. నిత్యకృషీ వలుడనే పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి

కేటీఆర్ అంటే యూత్ ఐకాన్ అని కొనియాడారు రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా విజయవంతంగా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ రిసెర్చ్ స్కాలర్, టిఆర్ఎస్వీ రాష్ట్ర సెక్రటరీ జి.రాజేష్ నాయక్ రచించిన పుస్తకాన్ని మంత్రి ప్రశాంత్ రెడ్డి మినిస్టర్ క్వార్టర్స్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు.

నేటి యువతకు కేటీఆర్ ఆదర్శం.. కేటీఆర్ రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారన్న మంత్రి

నేటి యువతకు కేటీఆర్ ఆదర్శం.. కేటీఆర్ రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారన్న మంత్రి

నేటి యువతకు ఆయన నడవడిక ఆదర్శమన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించడంలో కేటీఆర్ ది ముఖ్య పాత్ర అని తెలిపారు. ప్రపంచ నలుమూలల నుండి పెట్టుబడులు పెట్టేందుకు కొత్త ఇండస్ట్రీలు, ఐ.టి కంపెనీలు రాష్ట్రానికి రప్పించి ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఆయన అకుంఠిత దీక్ష కండ్ల ముందు సాక్షాత్కారిస్తుందని అన్నారు. ఐటి రంగంలో కె.టి.ఆర్ అనేక సంస్కరణలకు ఆజ్యంపోశారని, టి-హబ్ లాంటి వేదికలతో యువతలోని నైపుణ్యాన్ని వెలికితీసే స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తున్నారన్నారు.

ఐటీలో విప్లవాత్మక అభివృద్ది.. కేటీఆర్ కే సాధ్యమన్న ప్రశాంత్ రెడ్డి

ఐటీలో విప్లవాత్మక అభివృద్ది.. కేటీఆర్ కే సాధ్యమన్న ప్రశాంత్ రెడ్డి

అన్ని వర్గాల ప్రజల అభిమానం చూరగొన్న యువ నాయకుడు కేటిఆర్ అని మంత్రి వేముల ప్రశంసించారు. గులాబీ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మార్గదర్శకత్వంలో పార్టీలోని సామాన్య కార్యకర్త నుండి ముఖ్య నాయకుల వరకు సత్సంబంధాలు కొనసాగిస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపుతున్నారని అన్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను ప్రత్యేక నిధులతో సర్వాంగసుందరంగా తీర్చి దిద్దారని అన్నారు.హైదరాబాద్ మహానగరంలో ఎన్నో రోడ్లు,ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లను నిర్మించి హైదరాబాద్ నగర ప్రజల ట్రాఫిక్ ఇబ్బందులు కేటీఆర్ తీర్చారని ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి గుర్తు చేశారు.

కేటీఆర్ యూత్ ఐకాన్.. తెలివైన మంత్రి అన్న ప్రశాంత్ రెడ్డి

అంతే కాకుండా రిసెర్చ్ స్కాలర్ అయిన రాజేష్ నాయక్ తన అనుభవాల ద్వారా రాసిన "నిత్య కృషీ వలుడు కె.టి.ఆర్" పుస్తకం ప్రతి ఒక్కరు చదవాలని కోరారు. భవిష్యత్ లో మరిన్ని మంచి పుస్తకాలు రాయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్,నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పలువురు టిఆర్ఎస్వి నాయకులు పాల్గొన్నారు.

English summary
The Minister congratulated KTR on the occasion of his successful completion of three years as TRS Party Working President. On this occasion, Minister Prashant Reddy unveiled a book titled KTR Nithya Krishivaludu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X