మునుగోడు బీజేపీనేతతో మంత్రి కేటీఆర్ షాకింగ్ టెలిఫోన్ సంభాషణ.. వీడియో వైరల్!!
మునుగోడు ఉపఎన్నిక అధికార ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ, నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కూడా పూర్తయింది. దీంతో మునుగోడు బరిలో ఉన్న ప్రధాన పార్టీల నాయకులు అందరూ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. మునుగోడులో ఉప ఎన్నికల ప్రచారంలో టిఆర్ఎస్ పార్టీ తరఫున బరిలోకి దిగిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా మంత్రులు రంగంలోకి దిగి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
బీజేపీ నేతకు ఫోన్ చేసిన మంత్రి కేటీఆర్ .. వీడియో వైరల్
నియోజకవర్గంలో మండలాలు, గ్రామాలకు ఇన్చార్జిలుగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఎలాగైనా మునుగోడు ను టిఆర్ఎస్ ఖాతాలో వేసుకోవాలని శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రత్యర్ధి పార్టీ లో బలమైన నాయకులను టిఆర్ఎస్ బాట పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గట్టుపల్ మండలం లోని ఒక బలమైన బిజెపి నేత కు ఫోన్ చేసి మాట్లాడారు. ప్రస్తుతం మంత్రి కేటీఆర్ సదరు నేతతో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మీరు సహకరిస్తే గట్టుప్పల్ మండలాన్ని అభివృద్ధి చేస్తా
మునుగోడు నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత జగన్నాథంతో మంత్రి కేటీఆర్ టెలిఫోన్లో సంభాషించారు. మునుగోడు లో టిఆర్ఎస్ పార్టీకి సహకరించాలని మంత్రి కేటీఆర్ ఆయనను కోరారు. మీరు కొంచెం సహకరిస్తే గట్టుప్పల్ అభివృద్ధి చేసుకుందామని కేటీఆర్ ఆయనతో చెప్పారు. ఈ ఉప ఎన్నికతో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో నుంచి పోయేది లేదు, బీజేపీ అధికారంలోకి వచ్చేది లేదు అంటూ పేర్కొన్న కేటీఆర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి బిజెపి మనిషి కాదని, అవకాశవాద రాజకీయం కోసం బీజేపీలో చేరారని, ఆయన నియోజకవర్గాన్ని ఎప్పుడూ పట్టించుకున్న దాఖలాలు లేవని పేర్కొన్నారు.

అభివృద్ధి చేసే సహకారం కోసం అడుగుతున్నానన్న మంత్రి కేటీఆర్
తాను గట్టుప్పల్ మండలానికి ఇన్చార్జిగా ఉన్నా అని చెప్పిన కేటీఆర్, సహకరిస్తే గట్టుప్పల్ మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తాం అంటూ ఫోన్లో సంభాషించారు.
నియోజకవర్గంలో ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ, సహకారం కోసం అడుగుతున్నానని మంత్రి కేటీఆర్ సదరు బీజేపీ నేతకు చెప్పారు. గట్టుప్పల్ మండలంలో బిజెపి నేతకు ఉన్న పరపతి గురించి తమ పార్టీ నేతలు చెబుతున్నారని పేర్కొన్న మంత్రి కేటీఆర్, అభివృద్ధి చేస్తున్న తమ పార్టీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

రైతు బంధు భూ స్వాములకు కాకుండా రైతులకు, కౌలు రైతులకు ఇవ్వాలన్న బీజేపీ నేత
ఇక అన్ని సంక్షేమ పథకాలు, రైతు బంధు వంటి పథకాలు ఇస్తున్నామని పేర్కొన్న కేటీఆర్ తో రైతుబంధు పథకాన్ని వందల ఎకరాలు ఉన్న భూస్వాములకు ఇవ్వడం కాదు వ్యవసాయం చేసేవారికి కౌలు రైతులకు ఇవ్వాలని బిజెపి నేత జగన్నాథం సూచించారు. మొత్తానికి కేటీఆర్ తన ఫోన్ కాల్ ద్వారా బిజెపి నేత జగన్నాథం ను టిఆర్ఎస్ పార్టీ వైపు తిప్పుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆయన తన బిజెపి కోసమే పని చేస్తానని తేల్చి చెప్పారు.

బీజేపీ నేత జగన్నాధం కమిట్మెంట్ ను కొనియాడిన బీజేపీ స్టీరింగ్ కమిటీ చైర్మన్
ఇక మంత్రి కేటీఆర్ ఫోన్ కాల్ వీడియో వైరల్ అయిన తర్వాత, బీజేపీ నేత జగన్నాథం ను బిజెపి స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి అభినందించారు. మంత్రి కేటీఆర్ ఫోన్ చేసినప్పటికీ పార్టీకి మోసం చేయని జగన్నాథం తీరును కొనియాడారు. బీజేపీ నేతలను మంత్రులు కొనుగోలు చేయలేరని వివేక్ వెంకటస్వామి తేల్చిచెప్పారు. మంత్రులు ఎంతగా బిజెపి నేతలను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారో చెప్పడానికి ఇది ఒక నిదర్శనమని వివేక్ వెంకటస్వామి తెలిపారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications