రేవంత్ రెడ్డి ఓ థర్డ్ రేట్ క్రిమినల్ .. టీపీసీసీ 'చీప్' ; శశిథరూర్ పై అలా .. కేటీఆర్ ట్వీట్

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు . రేవంత్ రెడ్డి ఓ థర్డ్ రేట్ క్రిమినల్ అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. అంతేకాదు దొంగ ఒక పార్టీని లీడ్ చేస్తున్నారని, టీపీసీసీ 'చీప్ ' రేవంత్ అని ఎద్దేవా చేశారు. ఐటీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ గా ఉన్న కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ ను రేవంత్ రెడ్డి గాడిదతో పోల్చిన ఓ న్యూస్ క్లిప్ ను కేటీఆర్ ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. థర్డ్ రేట్ క్రిమినల్ కు పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగిస్తే ఇలాగే ఉంటుంది అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఇటీవల ఐటి స్టాండింగ్ కమిటీ చైర్మన్ హైదరాబాదులో తన బృందంతో పర్యటించారని, ఐటి అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించారని పేర్కొన్న ఆయన తనకు చెప్పకుండా వచ్చారని శశిధరూర్ ను గాడిద అంటూ వ్యాఖ్యలు చేశారంటూ రేవంత్ రెడ్డి తీరు పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ పర్యటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సమాచారం లేదని, ఇక ఈ ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి ముందు ప్రస్తావించినప్పుడు ఆయన శశిధరూర్ పై మండి పడ్డాడు అని, గాడిద అంటూ సంబోధించారని ఓ పత్రిక వార్త ప్రచురించింది. త్వరలోనే పార్టీ ఆయనను బహిష్కరిస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నట్లుగా ఆ వార్తా పత్రిక కథనాన్ని ప్రచురించింది.

KTR tweet on Revanth Reddy is a third rate criminal .. TPCC Cheap

అంతేకాదు శశిధరూర్, కేటీఆర్ ఇద్దరూ ఒకే తరహా మనుషులు అని రేవంత్ రెడ్డి అన్నారని, ఇంగ్లీష్ లో ప్రావీణ్యం ఉన్నంత మాత్రాన మేధావులం అని భావించాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్లుగా పత్రిక ప్రచురించింది. ఇక దీనిపై తీవ్రస్థాయిలో మండిపడిన కేటీఆర్ రేవంత్ రెడ్డి థర్డ్ రేట్ క్రిమినల్ అంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. కేటీఆర్ చేసిన ట్వీట్ ను రీ ట్వీట్ చేసిన టిఆర్ఎస్ పార్టీ నాయకుడు క్రిశాంక్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను సమర్థించారు. నిజంగానే రేవంత్ రెడ్డి టిపిసిసి చీప్ అని వ్యాఖ్యానించారు. ఐటిపై ఆయనకు అసలు పరిజ్ఞానం లేదని, ఐటీలో తెలంగాణ సాధించిన అభివృద్ధి ఆయనకు అర్థం కాదని, ఇలాంటి వ్యక్తిని టిపిసిసి అధ్యక్షుడిగా ఎన్నుకోవడం బ్యాడ్ ఛాయిస్ అంటూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లను ట్యాగ్ చేశారు క్రిశాంక్ . కాంగ్రెస్ లీడర్లను గౌరవించటం నేర్చుకోవాలని క్రిశాంక్ రేవంత్ రెడ్డికి చురకలంటించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+