పొలాల్లో వ్యాక్సినేషన్.. కేటీఆర్ ట్వీట్; ఏపీ ఫోటోతో తెలంగాణాలోనా.. ఏకిపారేసిన కాంగ్రెస్
తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోమారు తప్పులో కాలేశారా? ఏపీ వ్యాక్సినేషన్ ఫోటోను తెలంగాణా ఫోటోగా వాడుకుంటున్నారా ? అంటే అవును అనే అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంపై సోషల్ మీడియా వేదికగా ఫోటోలను పెట్టి ట్వీట్ చేసిన కేటీఆర్ వ్యాక్సినేషన్ జోరుగా కొనసాగుతుందని చెప్పే క్రమంలో పంటపొలాలలో పనిచేస్తున్న వారి దగ్గరకు వెళ్లి మరీ వ్యాక్సిన్లు ఇస్తున్నారని పేర్కొన్నారు. అయితే ఇందులోనే కేటీఆర్ తప్పులో కాలేశారని కాంగ్రెస్ నేతలు పాయింట్ అవుట్ చేస్తున్నారు .

ఆ ట్వీట్ తో కేటీఆర్ దొరికిపోయారంటున్న కాంగ్రెస్ పార్టీ నేతలు
గతంలో హైదరాబాద్ లోని సింగరేణి కాలనీ లో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను పోలీసులు పట్టుకోకపోయినా.. 24 గంటల్లోనే పట్టుకున్నారంటూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసిన కేటీఆర్, ఆతర్వాత తప్పుడు సమాచారం వల్ల పొరబాటు జరిగిందని పేర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో మారు ట్విట్టర్ వేదికగా కేటీఆర్ మళ్లీ అలాంటి తప్పు చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు . కేటీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని అంటున్నారు.
పొలాల్లో వ్యాక్సినేషన్ పై కేటీఆర్ ట్వీట్ .. ఏపీ ఫోటో మార్ఫ్ చేసి తెలంగాణా ఫోటోగా వాడారా ?
తెలంగాణ రాష్ట్రంలో పంట పొలాలకు వెళ్లి మరి వైద్య సిబ్బంది వ్యాక్సిన్లు వేస్తున్నారని కేటీఆర్ చెప్పిన విషయం వాస్తవమే అయినా, ఆయన పోస్ట్ చేసిన ఫోటో మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంట పొలాల్లోకి వెళ్లి వ్యాక్సిన్ ఇస్తున్న ఏపీకి సంబంధించిన ఫోటో . ఏపీలో వైద్య సిబ్బంది పొలం వద్దకు వెళ్లి రైతులకు రైతు కూలీలకు కరోనా వ్యాక్సిన్ వేస్తున్న ఈ ఫోటో, వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి తో పాటు పలువురు వైసిపి నేతలు పెద్ద ఎత్తున పోస్ట్ చేశారు. ఆ ఫోటో విజయనగరం జిల్లాలో పంట పొలాలలో వేసిన వ్యాక్సినేషన్ అని పేర్కొన్నారు. అనేక పత్రికలు ఈ ఫోటోను ప్రధానంగా ప్రచురించాయి. ఇక అదే ఫోటోను మార్ఫ్ చేసి తెలంగాణ కు సంబంధించిన ఫోటో గా మంత్రి కేటీఆర్ పోస్ట్ చేశారంటూ విమర్శలు వెల్లువ గా మారాయి.
తెలంగాణా హెల్త్ కేర్ వర్కర్ లను ప్రశంసిస్తూ కేటీఆర్ ట్వీట్
మంత్రి కేటీఆర్ చేసిన పోస్ట్ లో ఏపీకి సంబంధించిన ఫోటోను పోస్ట్ చేసి, తెలంగాణ హెల్త్‌కేర్ కార్మికులు అద్భుతమైన పని చేస్తున్నారనేది వాస్తవం. వారిని అభినందిద్దాం అని పేర్కొన్నారు. ఆపై మరో ట్వీట్ లో రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ, ఖమ్మం జిల్లాలోనూ పొలాల్లోకి వెళ్లి మరి రైతులకు వ్యాక్సిన్లు ఇస్తున్నారని, హెల్త్ కేర్ వర్కర్లు ఎంతో నిబద్ధతతో పని చేస్తున్నారని మరో రెండు ఫోటోలను ట్వీట్ చేశారు. ఇదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ వల్ల తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ విప్లవం కొనసాగుతుందని కూడా పేర్కొన్నారు.
Recommended Video
కేటీఆర్ ట్వీట్ రీ ట్వీట్ చేసి వాస్తవం ఇదే అని మరో పోస్ట్ పెట్టిన కాంగ్రెస్ నేత మణిక్కం ఠాగూర్
ఇక మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ ను కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మణిక్కం ఠాగూర్ టార్గెట్ చేశారు. ట్విట్టర్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. కెసిఆర్ కొడుకు మినిస్టర్ ఇంకా వేరే ప్రపంచం లోనే ఉన్నారని పక్క రాష్ట్రం లోని సక్సెస్ ను, తమ సక్సెస్ గా చెప్పుకుంటున్నారని, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఫోటోషాప్ లో ఎడిట్ చేసిన ఫోటోలతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తారని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ తప్పులు ఒప్పుకుంటారా క్షమాపణ చెప్తారా ? అంటూ మణిక్కం ఠాగూర్ కేటీఆర్ ను ప్రశ్నించారు.
ఏది ఏమైనా మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది తెలంగాణకు సంబంధించిన ఫోటోనా, లేదా మార్ఫ్ చేసిన ఏపీకి సంబంధించిన ఫోటోనా అన్నది పక్కన పెడితే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సునిశిత దృష్టిపై మాత్రం నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
న్యాయం చేయలేకపోయా - కవిత ఆవేదన -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications