విశ్వనగరమే టార్గెట్: నగర వీధుల్లో కెటిఆర్ అర్ధరాత్రి తనిఖీలు, సీరియస్

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రాజధాని నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని పదే పదే చెబుతున్న తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కెటి రామారావు హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగరంలో మంగళవారం అర్థరాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

ఈ తనిఖీల్లో మంత్రితో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. కూకట్‌పల్లి, పంజాగుట్ట ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి రోడ్లు, నీటిసరఫరా, మురుగు నీటిపారుదల వ్యవస్థను పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్లపై నీరు నిలవడాన్ని గమనించిన మంత్రి విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

బస్టాప్‌లలో ప్రయాణికులు కూర్చునే అవకాశం లేకుండా ఉందని మండిపడ్డారు.
అదేవిధంగా పంజాగుట్టలో చిన్నారి రమ్య కుటుంబం ప్రమాదానికి గురైన ప్రదేశాన్ని మంత్రి పరిశీలించారు. రోడ్డు ఇరుకుగా ఉండటం వల్లే ప్రమాదం జరిగినట్లు సిబ్బంది మంత్రికి వివరించారు.

సరైన ప్రతిపాదన సిద్ధం చేసి రోడ్డు వెడల్పునకు చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు. నగరంలో రోడ్ల నిర్మాణం, ఫుట్‌పాత్‌ల మరమ్మతు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. మంగళవారం రాత్రి 11.30 నుంచి 2గంటల వరకు మంత్రి తనిఖీలు నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరిన్ని రాత్రులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని మంత్రి వెల్లడించారు.

KTR visits hyderabad streets in night time

ఆరు నెలలు అనుకున్న పని 29 రోజుల్లోనే

అండర్‌గ్రౌండ్ విద్యుత్ లైన్లను అమర్చేందుకు విద్యుత్ శాఖ అధికారులు నగరం లో సుమారు 186 కిలోమీటర్లు తవ్వారు. దాదాపు రూ. 1000కోట్లతో చేపట్టిన ఆ పనిని పూర్తి చేయడానికి ఆరు నెలల సమయం పడుతుందన్నారు. అయితే, ఇంతలోనే నగరంలో భారీ వర్షాలు కురిశాయి. ఆ 186 కిలోమీటర్ల మేరకు తవ్విన రోడ్లపై వాహనాదారులు నరకం చూశారు.

కాగా, విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన మరుసటి రోజున(జూన్ 13న) నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన రోడ్ల తవ్వకాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సాధ్యమైనంత త్వరగా పనులను పూర్తి చేసి రోడ్లను పూడ్చివేయాలని అధికారులను ఆదేశించారు.

సదరు ప్రాజెక్టు కాంట్రాక్టర్‌ను సైతం రోడ్ల తవ్వకాలు జరిగిన ప్రాంతానికి పిలిచి మందలించారు. మంత్రి ఆదేశాలతో రగంలోకి దిగిన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ఆరు నెలలు పడుతుందన్న పనిని కేవలం 29 రోజుల్లోనే దాదాపుగా పూర్తి చేశారు. ఎర్రగడ్డ, ఉస్మానియా, బల్కంపేట, నారాయణగూడ, ముసారంబాగ్, ఇంబ్లిబన్ బస్‌స్టేషన్, ఫీవర్ హస్పిటల్, పాటిగడ్డ, వంటి ప్రాంతాల్లో పనులు పూర్తి అయ్యాయని ప్రస్తుతం అండర్‌గ్రౌండ్ విద్యుత్ కేబుల్స్ జాయింట్ల వద్ద పనులు జరుగుతున్నాయని ట్రాన్స్‌మిషన్ లైన్స్ అండ్ సబ్ స్టేషన్స్ ఎస్‌ఈ శ్రీరాంనాయక్ తెలిపారు.

అధునాతన టెక్నాలజీతో ఏర్పాటు చేసిన ఈ అండర్‌గ్రౌండ్ విద్యుత్ లైన్స్ వ్యవస్థ (220కెవి, 130 కెవి సామ ర్థ్యం కలిగినవి) ఎంతటి విపత్తులు సంభవించినా నగరంలో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడదన్నారు. మంత్రి ఆదేశాలతో అత్యంత వేగంగా పనులను పూర్తి చేశామని ఆయన వివరించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana Minister KT Rama Rao has visited hyderabad streets in night time.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి