సిస్టర్ స్ట్రోక్ కు కేటీఆర్ చిన్నమెదడు చితికిపోయింది
అవాస్తవాల ప్రచారంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కే. తారక రామారావు గోబెల్స్ ను మించిపోయారని గిరిజన సంక్షేమ శాఖామంత్రి సీతక్క అన్నారు. హైదరాబాద్ లోని సచివాలయంలో ఆమె విలేఖరులతో మాట్లాడుతూ... నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను కేటీఆర్ మర్చిపోయారని చెప్పారు. కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన చేసిన వ్యాఖ్యలకు ఆమె గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
కేటీఆర్ పై సీతక్క ఘాటు వ్యాఖ్యలు
కేటీఆర్ ఆరోపణలను తిప్పి కొట్టిన సీతక్క ఆయన పైన ఘాటుగా విమర్శలు చేశారు. సిస్టర్ స్ట్రోక్ కు కేటీఆర్ కు చిన్న మెదడు చితికి పోయింది అంటూ సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కమిషన్లు తీసుకున్నప్పుడు లేని భయం, ఇప్పుడు విచారణ కమిషన్ ముందుకు రావడానికి ఎందుకంటూ ప్రశ్నించారు. అబద్దాల పునాదుల మీద బీఆర్ఎస్ పార్టీ నడుస్తోందని పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్ కు లేదు
కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై కమిషన్ ఎదుట హాజరయ్యేందుకు BRS నాయకులు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలన్న మంత్రి, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవటంలో KTR చేసిన ఆరోపణను తిప్పకొట్టారు. కాళేశ్వరం కూలిపోయినపుడు అధికారంలో BRS పార్టీయే ఉందన్నారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్ కి లేదని విమర్శించారు.
కవిత చెప్పిన దెయ్యం బహుశా కేటీఆర్ నే కావచ్చు
తాజాగా కవిత చెప్పిన దెయ్యం బహుశా కేటీఆర్ నే కావచ్చని సీతక్క వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు పొందడం కోసమే కేటీఆర్ పదేపదే ఈడీ ప్రస్తావన తెస్తున్నారని సీతక్క ఆరోపించారు. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఆయన పైన కేసు నమోదు చేశారని సీతక్క గుర్తు చేశారు. ఇక యుద్ధంలో ట్రంప్ అనుసరించే నీతిని మోదీ అమలు చేస్తున్నారన్నారు.
కాళేశ్వరం కూలేశ్వరం ఎందుకు అయ్యిందో చెప్పు కేటీఆర్
అబద్దాన్ని నిజం చేయడం కోసం కేటీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని సీతక్క విమర్శలు గుప్పించారు కేటీఆర్ కు నిజాయితీ, నీతి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కూలేశ్వరం అయిందో చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. ED నేషనల్ హెరాల్డ్ కేసులో ముఖ్యమంత్రి పేరును ప్రస్తావించటంపై స్పందిస్తూ, స్వాతంత్ర్యం కోసం పోరాడిన పత్రికకు సహాయం చేయటంలో తప్పులేదని మంత్రి సమర్థించారు.












Click it and Unblock the Notifications