పెద్దల సభకు రమణ - మోత్కుపల్లి..!! టీఆర్‌ఎస్‌లో ఉత్కంఠ - కేసీఆర్ హామీలతో రేసులో...!!
తెలంగాణలో పెద్దల సభకు కొత్తగా వెళ్లేదెవరు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరికి అవకాశం ఇస్తారు. ఇప్పుడు ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్సీ స్థానాల ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూలు విడుదల చేసింది. 119 మంది సభ్యులున్న శాసనసభలో టీఆర్‌ఎస్‌కు సంఖ్యాపరంగా 103 మంది సభ్యుల బలం ఉంది. దీంతో ఎన్నిక జరిగే ఆరు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో..గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన వారు...ఇప్పుడు పదవీ విరమణ చేసిన వారు.. కొత్తగా ఆశావాహుల్లో ఉత్కంఠ పెరిగిపోతుంది.

భారీగా ఆశావాహుల జాబితా
ఎమ్మెల్యే కోటాలో పదవీ కాలం పూర్తి చేసుకున్న వారిలో మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ మంత్రి ఫరీదుద్దీన్, మాజీ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఆకుల లలిత ఉన్నారు. వీరిలో ముగ్గురికి తిరిగి అవకాశం ఖాయమనే ప్రచారం పార్టీలో మొదలైంది. గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, బోడకుంటి వెంకటేశ్వర్లు తమకు మళ్లీ అవకాశం దక్కుతుందనే ధీమాతో ఉన్నారు. పద్మశాలి, విశ్వ బ్రాహ్మణ వంటి సామాజిక వర్గాలకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తామని గతంలో కేసీఆర్ ప్రకటించడంతో ఎవరికి వారు మండలిలో అడుగుపెట్టే అవకాశాలను లెక్క వేసుకుంటున్నారు.

ముఖ్యమంత్రి చూపు ఎవరి వైపు
వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో 12 మంది స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీలు పదవీ కాలం పూర్తవుతోంది. కేసీఆర్ వివిధ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశముంది. ఇటీవలే పదవీకాలం పూర్తి చేసుకున్న స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయ కార్యదర్శి రమేశ్‌రెడ్డి, క్యామ మల్లేశ్ వంటి వారు జాబితాలో ఉన్నారు. ఇక, టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రులు ఎల్.రమణ, మోత్కుపల్లి నర్సింహులు, ఇనుగాల పెద్దిరెడ్డి తమకు అవకాశం వస్తుందనే ధీమాతో ఉన్నారు.

హామీ పొందిన వారికి ఛాన్స్ దక్కేనా
దీంతో పాటు వివిధ సందర్భాల్లో కేసీఆర్ నుంచి హామీ పొందిన పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కల్లపల్లి రవీందర్‌రావు, ఎంసీ కోటిరెడ్డి, పీఎల్ శ్రీనివాస్, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, సీఎం కార్యాలయ ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్ ఈసారి అవకాశం దక్కుతుందని అంచనా వేసుకుంటున్నారు. అయితే, ఎల్ రమణ..మోత్కుపల్లికి ఎమ్మెల్సీలుగా అవకాశం దక్కటం ఖాయమనే ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది. ఎల్ రమణను పార్టీ చేర్చుకొనే సమయంలోనే ఆయనకు హామీ ఇచ్చారని సమాచారం.

రమణ - మోత్కుపల్లికి అవకాశం దక్కుతుందా
దీంతో పాటుగా ముఖ్యమంత్రి తాజాగా అమలు చేస్తున్న దళిత బంధు విషయంలో సీఎంను ప్రశంసించటంతో పాటుగా తాజాగా టీఆర్ఎస్ లో చేరిన మాజీ మంత్రి మోత్కుపల్లికి సైతం ఎమ్మెల్సీ ఇస్తారని చెబుతున్నారు. నల్గొండ జిల్లా రాజకీయ సమీకరణాలతో పాటుగా దళిత బంధు స్కీం ఇప్పుడు ప్రభుత్వానికి ప్రతిష్ఠాత్మకంగా మారటంతో మోత్కుపల్లికి సైతం ఛాన్స్ దక్కుతుందనే ప్రచారం సాగుతోంది. ఇప్పుడు ఆరు స్థానాలే ఉన్నా..పోటీ మాత్రం భారీగా ఉంది.

ఇప్పుడు ఆరు..త్వరలో 12 సీట్ల భర్తీ
దీంతో..మరో రెండు నెలల్లో మరో 12 మందిని పార్టీ నుంచి శాసన మండలికి ఎంపిక చేసే అవకాశం అధికార టీఆర్ఎస్ పార్టీకి దక్కుతుంది. స్థానిక సంస్థల కోటాలో 12 స్థానాలు ఖాళీ కానున్నాయి. దీంతో..ఇప్పుడు ఆరుగురు...జనవరిలో మరో 12 మంది మొత్తంగా 18 స్థానాలు భర్తీ చేయటానికి అవకాశం ఏర్పడటం తో ఆశావాహులు సీఎం ను ప్రసన్నం చేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. ముందుగా ఎమ్మెల్యే కోటాలో ఆరు స్థానాలను భర్తీ చేయనున్నారు. హుజూరాబాద్ ఫలితాల తరువాత ఎమ్మెల్సీ సీట్ల భర్తీ పైన సీఎం ఫోకస్ పెట్టే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications