అదేమిటో చెప్పాలి, ఇచ్చేద్దామా: రేవంత్‌కు రమణ సవాల్, మోత్కుపల్లి తీవ్ర ఆగ్రహం

Posted By:
Subscribe to Oneindia Telugu
  L Ramana Challenges Revanth Reddy : సంపాదించినది పేదలకు ఇచ్చేందుకు సిద్ధమా | Oneindia Telugu

  హైదరాబాద్: తనపై కాంగ్రెస్ పార్టీ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎల్ రమణ ఘాటుగా స్పందించారు.

  రాహుల్ సభ లేకుంటే: రేవంత్ ప్లాన్ ఇదీ! ఇరకాటంలో పెట్టాడనే టీడీపీ నేతపై ఆగ్రహం

   ఆ ఉపాధి కూలీ ఏమిటో చెప్పాలి

  ఆ ఉపాధి కూలీ ఏమిటో చెప్పాలి

  ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తాను ఉపాధి కూలీని అంటూ తనపై రేవంత్ ఆరోపణలు చేశారని, అదేమిటో చెప్పాలని రమణ నిలదీశారు. దేనికి ఉపాధి కూలీగా ఉన్నానో చెప్పాలని అడిగారు.

   రేవంత్‌కు ఎల్ రమణ సవాల్

  రేవంత్‌కు ఎల్ రమణ సవాల్

  తనపై ఆరోపణలు చేసిన రేవంత్‌కు తాను ఓ సవాల్ విసురుతున్నానని రమణ అన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను సంపాదించినది, ఆయన సంపాదించినది పేదలకు ఇచ్చేందుకు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు.

   1994లో ఉన్న ఆస్తులే ఇప్పుడూ ఉన్నాయి

  1994లో ఉన్న ఆస్తులే ఇప్పుడూ ఉన్నాయి

  తనకు 1994లో ఎమ్మెల్యే కాకముందు ఎన్ని ఆస్తులు ఉన్నాయో, ఇప్పటికీ అవే ఉన్నాయని, ఎవరైనా తనకు సాయం చేసేందుకు ముందుకు వస్తే ఆ మొత్తం పేదలకు, సన్నిహితులకు అందేలా చూశానని రమణ చెప్పారు.

   రేవంత్ చేరిక ద్వారా ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు

  రేవంత్ చేరిక ద్వారా ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు

  ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయని రేవంత్ రెడ్డిని చేర్చుకోవడం ద్వారా రాహుల్ గాంధీ ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారని రమణ నిలదీశారు. కాగా, రంగారెడ్డి జిల్లాకు చెందిన 200 మంది యువకులు సోమవారం టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

   నీతిమంతుడివే అయితే రాజీనామా ఎవరికిచ్చావు?

  నీతిమంతుడివే అయితే రాజీనామా ఎవరికిచ్చావు?

  తాను ఎంతో నీతిమంతుడిని అని, తాను రాజీనామా చేశానని రేవంత్ రెడ్డి చెబుతున్నారని, మరి ఆ రాజీనామా ఎవరికి ఇచ్చారో చెప్పాలని మరో తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Telangana Telugu Desam Party leaders L Ramana and Mothkupalli question Revanth Reddy over his resignation and assets.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి