టీడీపీ షాక్: రేవంత్‌పై ఎల్ రమణ సంచలనం, రాజీనామాపై ఊహించని ట్విస్ట్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: కొడంగల్ శాసన సభ్యులు రేవంత్ రెడ్డి రాజీనామాపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రాజీనామా పత్రాన్ని ఇచ్చానని చెబుతున్న రేవంత్‌కు ఇది షాక్.

  Revanth Reddy resignation High drama : "రాజీనామా" చెయ్యలేదంటగా ? | Oneindia Telugu

  రేవంత్ రాజీనామాపై హైడ్రామా: ఏం జరుగుతోంది?

  కొత్త ట్విస్ట్ ఇచ్చిన ఎల్ రమణ

  కొత్త ట్విస్ట్ ఇచ్చిన ఎల్ రమణ

  శుక్రవారం ఎల్ రమణ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి రాజీనామాపై కొత్త ట్విస్ట్ ఇచ్చారు. అసలు రేవంత్ రాజీనామా చేయనే లేదని చెప్పారు. ఆయన చెబుతున్నది అబద్దమని అభిప్రాయపడ్డారు.

  చంద్రబాబుకు ఇచ్చానని చెప్పడం అవాస్తవం

  చంద్రబాబుకు ఇచ్చానని చెప్పడం అవాస్తవం

  తమ పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తాను రాజీనామా ఇచ్చానని రేవంత్ చెబుతున్నారని, కానీ అదంతా అవాస్తవం అని చెప్పారు. అందులో నిజం లేదన్నారు.

   చంద్రబాబుకు దండం పెట్టి వచ్చారు, ఇదీ జరిగింది

  చంద్రబాబుకు దండం పెట్టి వచ్చారు, ఇదీ జరిగింది

  రాజీనామా ఇచ్చామని చెబుతున్న రోజు, అమరావతికి వచ్చిన రేవంత్ కేవలం చంద్రబాబుకు దండం పెట్టి వచ్చారని తెలిపారు. దారిలో పోతూ పోతూ ఎవరికి ఇచ్చాడో తెలియదని, చంద్రబాబుకు ఇచ్చానని చెప్పడం మాత్రం సరికాదన్నారు.

   నాయకుడి స్థాయి నుంచి కార్యకర్తకు పడిపోయిన రేవంత్

  నాయకుడి స్థాయి నుంచి కార్యకర్తకు పడిపోయిన రేవంత్

  రేవంత్ రెడ్డి ఎన్నో పార్టీలు మారారని ఎల్ రమణ మండిపడ్డారు. ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు మంచి నాయకుడిగా ఎదిగారన్నారు. ఇప్పుడు నాయకుడి స్థాయి నుంచి కార్యకర్తకు పడిపోయారని ఎద్దేవా చేశారు. తాను కాంగ్రెస్‌లో కార్యకర్తనని ఆయనే చెప్పుకుంటున్నారన్నారు.

   ఈ సమయంలో రేవంత్ డ్రామాలు

  ఈ సమయంలో రేవంత్ డ్రామాలు

  ఎమ్మెల్యే పదవి ముగిసే సమయంలో రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని ఎల్ రమణ మండిపడ్డారు. ఎందరు పార్టీ మారినా కేడర్ మాత్రం చెక్కు చెదరలేదన్నారు. పాలమూరులో ఎర్ర శేఖర్ అధ్యక్షతన పార్టీ బలంగా ఉందన్నారు. రేవంత్ వెళ్లినప్పుడల్లా ఆ పార్టీలు బలహీనపడలేదన్నారు.

  తెలంగాణలో టీడీపీనే ప్రత్యామ్నాయం

  తెలంగాణలో టీడీపీనే ప్రత్యామ్నాయం

  తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి తెలుగుదేశం పార్టీనే ప్రత్యామ్నాయం అని ఎల్ రమణ చెప్పారు. తెలుగుదేశం తిరిగి పుంజుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. త్వరలో కొడంగల్‌లో భారీ సభను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశముందని, అది ప్రజలకు లాభం అన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Telangana Telugu Desam party chief L Ramana new twist on Kodangal MLA Revanth Reddy's resignation to Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి