Mallareddy: దిగొచ్చిన మంత్రి మల్లారెడ్డి - ఎమ్మెల్యేలతో రాజీ ఫార్ములా..!
ఎమ్మెల్యేల అమ్మతి రాగంతో కార్మిక శాఖ మంత్రి మంత్రి మల్లారెడ్డి దిగొచ్చారు. తమది క్రమశిక్షణ గల పార్టీ అని..ఇది ఇంటి సమస్య అని.. దీని త్వరలో పరిష్కరించుకుంటామని చెప్పారు. తాను ఎవరితోనూ విబేధాలు పెట్టుకునే రకం కాదన్నారు. మా మధ్య సమస్య లేదని... తానే ఎమ్మెల్యే ల ఇంటికి వెళతాను... వారితో మాట్లాడతానని తెలిపారు. తాను గాంధేయవాదినని.. తమ ఇంటి సమస్య... మీడియానే ఎక్కువగా చూపిస్తుందని మల్లారెడ్డి అన్నారు. పదవులు కేసీఆర్, కేటీఆర్ ఇస్తారు... తాను కాదని తెలిపారు. అవసరమైతే ఎమ్మెల్యేల ను అందరినీ తమ ఇంటికి ఆహ్వానిస్తానని మల్లారెడ్డి వివరించారు.

ఏకపక్షంగా
మంత్రి మల్లారెడ్డి నామినేటెడ్ పదవుల భర్తీలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మేడ్చల్ జిల్లా కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అన్ని పదవులను తన నియోజకవర్గ నాయకులకు కట్టబెడుతున్నారని, పార్టీ కోసం పనిచేసిన వారికి సముచిత స్థానం ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ఈ వ్యవహారాన్ని కేసీఆ,ర్ కేటీఆర్ వద్దని తేల్చుకుంటాం అంటూ వారు స్పష్టం చేశారు.

మైనంపల్లి హానుమంతరావు
ఎమ్మెల్యేల మాటలను బేఖాతరు చేస్తూ మంత్రి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తమ తమ నియోజకవర్గాల్లో ఉన్న నాయకులకు తాము మంత్రి కారణంగా న్యాయం చేయలేక పోతున్నామని వారు వాపోయారు. సోమవారం మైనంపల్లి హానుమంతరావు నివాసంలో ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు.

శుభకార్యం
ఈ సమావేశంలో కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, శేరి లింగం పల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ భేటీ అయ్యారు. ఎమ్మెల్యే మైనంపల్లి నివాసంలో జరిగిన శుభకార్యంలో తాము హాజరు కాలేదని..దీంతో, ఇప్పుడు తన నివాసం లో బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేసి ఆహ్వానిస్తే వచ్చామని ఎమ్మెల్యేలు చెప్పారు.
ఎమ్మెల్యేలు చెప్పిన పనులు చేయవద్దంటూ మంత్రి జిల్లా కలెక్టర్ తో పాటుగా ఇతర అధికారులకు చెప్పారని సమాచారం. దీనిని ఎమ్మెల్యేలు సీరియస్ గా తీసుకున్నారు. మంత్రి తమకు సహకరించాల్సిన సమయంలో.. ఎమ్మెల్యేలు చెబితే చేయద్దంటూ అధికారులు ఎలా చెబుతారని వీరంతా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మైనంపల్లి హనుమంతరావును ఉద్దేశించి ఈ విధంగా సూచనలు చేయటం పైన ఆయన ఆగ్రహంతో ఉన్నారు. దీంతో, ఇతర ఎమ్మెల్యేలను కలుపుకొని మంత్రి వ్యవహార శైలి పైన సీఎం వద్దకు వెళ్లేందుకు వీరు సిద్దమైనట్లు సమాచారం. కానీ, ఎమ్మెల్యేలు మాత్రం తమ భేటీలో రాజకీయ అంశాలు లేవని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications