మంచిరేవులలో వేలంలో రూ.8 లక్షలు పలికిన గణేష్ లడ్డూ
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవులలో వినాయకుడి లడ్డూ వేలంలో రూ.8 లక్షలు పలికింది.
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవులలో వినాయకుడి లడ్డూ వేలంలో రూ.8 లక్షలు పలికింది.
గ్రామ సర్పంచ్ మేకల ప్రవీణ్ వేలం పాటలో పాల్గొని రూ. 8,01,000లకు లడ్డూను దక్కించుకున్నారు. 2011 నుంచి అయిదుదుసార్లు ఈ లడ్డూను ఆయన దక్కించుకున్నారు.

ఈ గ్రామంలో వినాయక మండపంలో ఉంచిన లడ్డూకు వేలం నిర్వహించగా 2011లో రూ.45వేలు, 2013లో రూ.63వేలు, 2014లో రూ.2,00,201, 2016లో రూ. 7,02,700లకు దక్కించుకోగా, ఈసారి ఏకంగా రూ.8.01లక్షలకు దక్కించుకున్నారు.












Click it and Unblock the Notifications