వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లేడీస్ ఫస్ట్... ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారంలో నయా ట్రెండ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సరిగ్గా 11 గంటల 30 నిమిషాలకు సభ కొలువుదీరింది. ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ అధ్యక్షతన శాసనసభ సమావేశాలు మొదలయ్యాయి. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కొనసాగుతోంది. తొలుత సీఎం కేసీఆర్ శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆరుగురు మహిళా ఎమ్మెల్యేలు ఒకరు టీఆర్ఎస్, మరొకరు కాంగ్రెస్ అలా ఆరుగురు వరుసగా ప్రమాణస్వీకారం చేశారు. రేఖా నాయక్(టీఆర్ఎస్), డి.అనసూయ అలియాస్ సీతక్క (కాంగ్రెస్), గొంగిడి సునీత (టీఆర్ఎస్), హరిప్రియ నాయక్ (కాంగ్రెస్), పద్మా దేవేందర్ రెడ్డి (టీఆర్ఎస్), సబితా ఇంద్రారెడ్డి (కాంగ్రెస్), ప్రమాణం చేశారు. అనంతరం ఇంగ్లీష్ అల్ఫాబెట్ ప్రకారం మిగతా ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తున్నారు.

ladies first, new trend in mlas swearing ceremony

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం మొదలయింది. తొలుత సీఎం కేసీఆర్ ప్రమాణం చేశారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే నేను.. శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడినైన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే నేను.. సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.. అంటూ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. మిగతా ఎమ్మెల్యేలు కొందరు తెలుగులో, మరికొందరు ఇంగ్లీషులో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.

English summary
The Telangana Assembly sessions have begun. For the first time Women MLA's were sworn in after the Chief Minister KCR had sworn in as Legislative Member. This gave rise to a new trend.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X