శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఖుష్బూ మిస్సింగ్ : వీడిన మిస్టరీ!
హైదరాబాద్ : శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఖుష్బూ అనే ఓ మహిళ ప్రయాణికురాల అదృశ్యం వెనుక మిస్టరీ వీడింది. భర్త, ఆమె కుటుంబంతో తలెత్తిన విబేధాల కారణంగానే ఖుష్బూ ఎయిర్ పోర్టు నుంచి భర్తకు చెప్పకుండా వెళ్లిపోయిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు.. ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చిన ఖుష్బూ క్యాబ్ ద్వారా అక్కడినుంచి వెళ్లిపోయినట్టు గుర్తించారు.

కాగా, వాస్తవానికి దంపతులిద్దరు దుబాయ్ నుంచి కోల్ కతాకు వెళ్లాల్సి ఉంది. దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు చేరుకున్న దంపతులు.. ఇక్కడి నుంచి మరో విమానంలో కోల్ కతా వెళ్లాల్సి ఉంది. అయితే కోల్ కతా వెళ్లాల్సిన విమానానికి ఇంకా సమయం ఉండడంతో.. ఎయిర్ పోర్టులోనే షాపింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు.
అనంతరం ఏమైందో ఏమో తెలియదు గానీ తన భార్య కనిపించడం లేదని ఎయిర్ పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు అభినవ్. అభినవ్ ఫిర్యాదుతో సీసీటీవి ఫుటేజీని పరిశీలించిన పోలీసులు ఖష్బూను ఎవరు కిడ్నాప్ చేయలేదని, ఆమె పారిపోయిందని నిర్దారించారు.












Click it and Unblock the Notifications