తెలంగాణ మ‌హిళా పోలీస్ ఆఫీస‌ర్‌కి వేధింపులు

ఇటీవ‌ల కాలంలో సాధార‌ణ‌ మ‌హిళ‌ల‌కే కాదు.. మ‌హిళా పోలీసుల‌కు కూడా అసాంఘిక‌ వేధింపులు త‌ప్ప‌డం లేదు. గ‌త కొన్ని రోజులుగా హైద‌రాబాద్‌లో ప‌నిచేసే మ‌హిళా పోలీసు ఆఫీస‌ర్‌కి సైబ‌ర్ వేధింపులు ఎదుర‌య్యాయి. ఒక‌ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి గ‌త కొన్ని రోజులుగా ఆమెకు వాట్ప‌ప్‌లో అనేక అస‌భ్య‌క‌ర‌మైన ఫోటోలు, వీడియోలు పంపిస్తున్నాడు. దీంతో ఆమె సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసిన పోలీసులు కొత్త‌ టెక్నాల‌జీ సాయంతో నింధితుడిని గుర్తించారు.

హైద‌రాబాద్‌లోని మ‌హిళా భ‌ద్ర‌త విభాగంలో అసిస్టెంట్ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న లేడీ పోలీస్ ఆఫీస‌ర్‌కి ఒక పోకిరి నుంచి వేధింపులు ఎదుర‌య్యాయి.. గ‌త కొన్ని రోజులుగా ఓ ఫోన్ నెంబ‌ర్ నుంచి వాట్పాప్‌లో అశ్లీల పోటోలు, వీడియోలు , మెసేజ్‌లు వ‌స్తున్నాయి. తొలుత అనుకోకుండా వ‌చ్చాయేమో అని ఆమె భావించి అత‌నిని హెచ్చ‌రించి వ‌దిలేశారు. అయినా వేధింపులు ఆగ‌లేదు. దీంతో ఆమె సిటీ సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసిన పోలీసులు దీనిని ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నారు. సైబ‌ర్ క్రైమ్ పోలీసులు లేటెస్ట్ టెక్నాల‌జీ సాయంతో ఆ నిందితుడిని గుర్తించేందుకు ప్ర‌య‌త్నించ‌గా అత‌డిని కేర‌ళ వాసిగా గుర్తించారు.

 Lady police officer got vulgor videos on whatsapp

రెండు రోజుల క్రితం సైబ‌ర్ క్రైమ్ పోలీసులు ప్ర‌త్యేక బృందంతో బ‌య‌లు దేరి కేర‌ళ‌కు చేరుకున్నారు. తిరువ‌నంత‌పురం స‌మీపంలోని ఓ ప‌ల్లెటూరులో స‌ద‌రు నింధితుడిని గుర్తించారు. పోలీసులు అత‌డిని అరెస్ట్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీనివాస్ రావు నేతృత్వంలోని పోలీసుల‌ బృందం ఆ గ్రామానికి చేరుకుంది . అయితే అక్క‌డికి చేరుకున్న పోలీసుల‌కు అస‌లు విషయం తెలిసి షాక్ అయ్యారు. అత‌డు ఒక మ‌తిస్థిమితం లేని చెవిటి, మూగ‌ వ్య‌క్తిగా గుర్తించారు. నింధితుడి కుటుంబ స‌భ్యులు అత‌డు చెవిటి, మూగ కావ‌డంతో అత‌నికి ఒక‌ సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ ఫోన్ కొనిచ్చారు. స్మార్ట్ ఫోన్‌తో కాల‌క్షేపం చేసే అత‌డు ఆశ్లీల ఫోటోలు, వీడియోలు డౌన్‌లోడ్ చేసుకోని వాటిని ఇత‌రుల‌కు వాట్పాప్‌లో పంపిస్తున్నాడు.

కాగా, పోలీసులు అత‌ని ఫోన్ తీసుకుని ప‌రిశీలించ‌గా అందులో చాలా ఆస‌భ్య‌క‌ర ఫోటోలు, వీడియోలు ఉన్న‌ట్లు గుర్తించారు. పోలీసులు నింధితుడు కుటుంబ స‌భ్యుల‌కు ఈ విష‌యం చెప్పి అత‌డిని ప్ర‌శ్నించారు. అయితే నింధితుడు, త‌న‌కు ఆ మ‌హిళా పోలీస్ ఆఫీస‌ర్ తెలియ‌ద‌ని , ఎదో ఒక నెంబ‌ర్ ఎంపిక చేసుకుని రోజూ ఇలా వీడియోలు, ఫోటోలు పంపిస్తుంటాన‌ని చెప్పాడు. దీంతో ఇలాంటి విష‌యాల్లో జాగ్ర‌త్తగా లేక‌పోతే చాలా స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని పోలీసులు నింధితుడిని కుటుంబ స‌భ్యుల‌కు వార్నింగ్ ఇచ్చారు. అత‌డి మాన‌సిక ప‌రిస్థితి స‌రిగ్గా లేద‌ని గుర్తించిన‌ పోలీసులు .. అరెస్ట్ చేసే అవ‌కాశం లేక‌పోవ‌డంతో వారికి నోటీసులు ఇచ్చి అత‌డిని హెచ్చ‌రించి తిరిగి హైద‌రాబాద్ వ‌చ్చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+