భర్త బెంగళూర్‌లో, లేడీ టెక్కీ ఆత్మహత్య: ఉద్యోగాలు ఇప్పిస్తామని వ్యభిచారంలోకి...

హైదరాబాదులో ఓ మహిళా టెక్కీ ఆత్మహత్య చేసుకుంది. భర్త బెంగళూరులో ఉండగా, ఆమె ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని మరణించింది.

హైదరాబాద్: ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన హైదరాబాదులోని కేపీహెచ్‌బీ కా లనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చేసుకుంది. ఎస్సై సైదేశ్వర్ ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు అందించారు. .విజయవాడకు చెందిన వడ్లమూడి రమాదేవి(32), ఆదిత్య దంపతులిద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. ఈ నెల 9న వీరు రెండో పెళ్లి చేసుకున్నారు.

భర్త ఆదిత్య బెంగుళూర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. రమాదేవి కేపీహెచ్‌బీ కాలనీ 5వ ఫేజ్‌లోని సత్యసాయి ఎన్‌క్లేవ్‌లో తల్లిదండ్రులతో ఉంటూ హైటెక్‌సిటీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తోంది. కాగా, బుధవారం రమాదేవి తన బెడ్‌రూంలో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆ త్మహత్య చేసుకుంది. వ్యక్తిగత కారణాలవల్లే ఆత్యహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Lady techie commit suicide in Hyderabad

వ్యభిచార ముఠా పట్టివేత

వ్యభిచార ముఠా నిర్వాహకులపై సికింద్రాబాదు గోపాలపురం పోలీసులు పీడీ యాక్టు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్ రాంచంద్రారెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలు అందించారు. బోరబండకు చెందిన పి. శివకిరణ్ (28) , ఉప్పల్ చిలుకానగర్ కు చెందిన జగదీష్ (30), రాహుల్ (28), శివానంద్ (29)లు ఓ ముఠాగా ఏర్పడి యువతులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయ మాటలు చెప్పి వ్యభిచార వృత్తిలోకి దింపుతున్నారు. వీరి పై నిఘా పెట్టిన పోలీసులు ఇటీవల నలుగురు నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపించారు. బుధవారం వీరిపై పీడీ యాక్టు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ వెల్లడించారు.

కొత్త బట్టలు ఇప్పించలేదని యాసిడ్ తాగి...

కొత్త దుస్తులు ఇప్పించలేదని మనస్తాపంతో ఓ బాలిక యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ సంఘటన హైదరాబాదులోని ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసకుంది.

వివరాలు ఇలా ఉన్నాయి - యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హజీపురం గ్రామానికి చెందిన నారా బాల్‌రాజ్ ప్రస్తుతం ఎల్బీనగర్‌లోని గుంటి జంగయ్యనగర్ కాలనీలో ఉంటూ కూలీపని చేసుకుంటున్నాడు. బాల్‌రాజ్‌కు కూతురు జ్యోత్స్న (15), కుమారుడు ఆదిశేషు ఉన్నారు. జ్యోత్స్న ఎల్బీనగర్‌లోని శాంతినికేతన్ స్కూల్‌లో పదవ తరగతి చదువుతోంది.

బాలరాజ్ చెల్లెలు కూతురు ఇంటిలో శుభకార్యం ఉండటంతో ఈనెల 23న షాపింగ్ వెళ్లిన ఆయన భార్య కుమారుడు ఆదిశేషుకు నూతన దుస్తులు తీసుకు వచ్చింది. అయితే తనకు ఎందుకు కొత్త బట్టలు తేలేదంటూ జ్యోత్స్న తల్లిని ప్రశ్నించడంతో ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్నామని మరోసారి ఇప్పిస్తానని చెప్పింది. దీంతో మనోవేదనకు గురై అదే రాత్రి బాత్‌రూమ్ క్లీన్ చేసే యాసిడ్ తాగింది.

దాన్ని గమనించిన కుటుంబసభ్యులు జ్యోత్స్నను వెంటనే స్థానిక ప్రైవేటు దవాఖానలో చేర్పించారు. ఈనెల 24న గాంధీకి చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం జ్యోత్స్న మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+