హైదరాబద్‌లో మహిళా టెక్కీ మృతి: ఆత్మహత్యనా, హత్యానా?
హైదరాబాద్: హైదరాబాద్‌లో ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బలవన్మరణానికి పాల్పిడంది. నగరంలోని కూకట్‌పల్లి మైత్రినగర్‌లో శుక్రవారం మధ్యాహ్నం ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. మైత్రినగర్‌లో నివాసం ఉంటున్న ప్రసన్న అనే మహిళా టెక్కీ ప్రసన్న అత్మహత్య చేసుకుందని ప్రాథమికంగా నిర్ధారించారు.
అయితే ప్రసన్నది ఆత్మహత్య కాదని, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. గత కొంతకాలంగా భర్త, అత్తమామలు ఆమెను వేధిస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు చెబుతున్నారు.

ఇదిలావుంటే, ఖమ్మం జిల్లాలో నాటు సారాకు బానిసైన ఓ వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన జిల్లాలోని కొత్తగూడెం మండలం సర్వారం గ్రామంలో చోటు చేసుకుంది.
గ్రామానికి చెందిన బిచ్చ (43) అనే వ్యక్తి కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో బిచ్చ నాటుసారాకు బానిసయ్యాడు. కొన్ని రోజులుగా నాటుసారా బంద్ కావడంతో మనస్తాపానికి గురై కిరోసిన్ పోసుకుని ఒంటికి నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు అతన్ని కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.












Click it and Unblock the Notifications