హుస్సేన్ ‌సాగర్‌లో ఆత్మహత్యాయత్నం: ఒకే రోజు 5గుర్ని కాపాడిన లేక్ పోలీసులు

హైదరాబాద్: హైదరాబాదులోని హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అయిదుగుర్ని లేక్‌ పోలీసులు రక్షించారు. సమస్యలతో సతమతమవుతూ జీవితంపై విరక్తి చెంది వారు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కొద్దిరోజుల క్రితం కేవలం పదమూడు గంటల్లో మరో ఆరుగుర్ని రక్షించారు.

బుధవారంనాడు సాయంత్ర ఆరుగంటల 45 నిమిషాల నుంచి గురువారం సాయంత్రం ఆరు గంటల 25 నిమిషాల వరకు అంటే దాదాపు ఇరవై నాలుగు గంటల్లో హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించగా, అది గుర్తించిన కానిస్టేబుల్ రాజ్‌కుమార్ అయిదుగుర్ని రక్షించారు.

ఈ నెల 24వ తేదీన బుధవారం సాయంత్రం ఆరు గంటల 45 నిమిషాల ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన నల్గొండ జిల్లా మిర్యాలగూడ వాస్తవ్యులు భీంశెట్టి భాస్కర్ (32) తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నట్లు గుర్తించిన లేక్ పోలీసులు సకాలంలో స్పందించి రక్షించారు.

 Lake police protect five persons from suicide bid

అయిదేళ్ల క్రితం వివాహమైందని, మూడేళ్ల క్రితం తన భార్య తనపై దామరచర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందని ఆ తర్వాత వివాదం సెటిల్‌మెంట్ అయి కలిసి జీవిస్తున్నట్లు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే కొద్దిరోజుల క్రితం తన తల్లిని చికిత్స నిమిత్తం నగరానికి తీసుకొచ్చానని, అప్పటి నుంచి తన తల్లి, భార్య గొడవలు పడుతున్నందున తాను వేదనకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

గురువారం సికిందరాబాద్ సెయింట్ మేరీ హై స్కూల్ ఎదురుగా నివసించే జె.సునీత అనేక 31 ఏళ్ల మహిళ కూడా సుమారు సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో ఆత్మహత్యాయత్నానికి యత్నిస్తున్నట్లు గమనించిన లేక్ పోలీసు కానిస్టేబుల్ సాయి కిరణ్, అభిలాష్‌లు ఆమెను రక్షించారు.

పదేళ్ల క్రితం తాను భర్తను కోల్పోయానని ఆ తర్వాత తన పిల్లలు ఇద్దరు పిల్లలను ఎంతో కష్టపడి చదివిస్తున్నా, తన కూతుళ్లలో ఒకరు సక్రమంగా చదవకపోవటం వల్ల మనస్తాపానికి చెందిన ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు విచారణలో తెలిపినట్లు లేక్ పోలీసులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+