సారిక, ఆమె పుత్రులకు కన్నీటి వీడ్కోలు: వరంగల్‌లోనే అంత్యక్రియలు
వరంగల్: మాజీ పార్లమెంటు సభ్యుడు సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు కుమారుల అంత్యక్రియలు గురువారం సాయంత్రం ముగిశాయి. వరంగల్ నగరంలోని పోతన నగర్‌లో ఉన్న స్మశానవాటికలో సారికకు ఆమె తల్లి, బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు.
గురువారం ఎంజీఎం ఆస్పత్రిలో సారిక ఆమె ముగ్గురు కుమారులకు పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత మృతదేహాలను బంధువులకు అప్పగించారు. సారికకు వీడ్కోలు పలికేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు.
Photos: రాజయ్య కోడలు మృతి

అంతకు ముందు అనుమానాస్పద పరిస్థితిలో మరణించిన సారిక, ముగ్గురు మనవళ్ల మృతదేహాలకు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తయింది. హైదరాబాద్ నుంచి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో ఈ పోస్టుమార్టం పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో పోస్టుమార్టం నివేదిక వెల్లడైతే గానీ సారిక, పిల్లలది బలవన్మరణమో, ఆత్మహత్యోనన్న విషయం తెలిసే అవకాశం లేదు.
అనుమానాస్పద స్థితిలో సారిక, ఆమె పిల్లలు సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే. మాజీ ఎంపీ రాజయ్య, ఆయన భార్య మాధవి, కొడుకు అనిల్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. రాజయ్య కుటుంబ సభ్యులకు కూడా ఎంజీఎం ఆస్పత్రిలోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం వారు ముగ్గురూ పోలీసుల అదుపులో ఉండడంతో వాళ్లకు కూడా వైద్య పరీక్షలు చేశారు.












Click it and Unblock the Notifications