• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మనస్పూర్తిగా నవ్వుకొని.!గట్టిగా వాటేసుకుని.!మాస్క్ తో చెంపమీద కొట్టి.!ఈటలతో ఆప్యాయంగా కేకే.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : పెళ్లిళ్ల సీజన్ జోరుగా సాగుతోంది. కరోనా మూడో దశ ప్రారంభం కాక ముందే శుభకార్యాలు కానిచ్చేస్తే ఓ పనైపోతుందనుకుంటున్నారు చాలా మంది. ఇందులో భాగంగానే చాలా మంది తల్లిదండ్రులు పెళ్లీడుకొచ్చిన తమ పిల్లలకు వివాహాలు జరిపించేస్తునన్నారు. కరోనా మూడో వేవ్ మొదలైతే ఎన్నో నిబంధనలు, పరిమిత సంఖ్యలో బంధు మిత్రులు.. ఎందుకు ఈ లేనిపోని చికాకు అనుకుని ఎలాంటి నిబంధనలు లేని సమయంలోనే ముందుగా అనుకున్నట్టు ఎంతో గ్రాండ్ గా వివాహం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు తల్లి దండ్రులు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల జోరు చాలా పెరిగినట్టు తెలుస్తోంది.

ఈటల బుజం తట్టి, బుగ్గలు నిమిరి.. పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న కేకే..

ఈటల బుజం తట్టి, బుగ్గలు నిమిరి.. పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న కేకే..

ఇక తెలంగాణలో ఏ ఫంక్షన్ హాల్ చూసిన పెళ్లి అలంకరణలతో కళాత్మకంగా కనిపిస్తున్నాయి. గతం వారం ఒక్కరోజే తెలంగాణలో 35 పెళ్లిల్లు జరిగాయంటే ఆశ్చర్యం వేయక మానదు. ఈ 35 పెళ్లిళ్లు హుజురాబాద్ నియోజకవర్గంలో జరిగడం విశేషం. ఇక తన సొంత నియోజక వర్గంలో జరిగిన పెళ్లిళ్లకు అక్కడి స్థానికి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరవ్వకుండా ఉంటారా.? అస్సలే ఉండలేరు. ఆహ్వానించిందే తడవుగా తన నియోజక వర్గంలో పెళ్లిళ్లకు హాజరవుతున్నారు ఈటల రాజేందర్. ఇటీవల తన నియోజక వర్గంలో జరిగిన 35 పెళ్లిళ్లకు హాజరై అందరిని ఆశ్చర్యానికి గురి చేసారు ఈటల రజేందర్. కాని ఇక్కడ ఓ అరుదైన సంఘటన చోటుచేకుంది.

స్నేహం స్నేహమే.. రాజకీయం రాజకీయమే.. ఈటలను మనస్పూర్తిగా పలకరించిన కేకే

స్నేహం స్నేహమే.. రాజకీయం రాజకీయమే.. ఈటలను మనస్పూర్తిగా పలకరించిన కేకే

టీఆర్ఎస్ పార్టీలో దాదాపు రెండో స్ధానంలో కొనసాగిన ఈటల రాజేందర్ కు పార్టీలో మంచి పట్టు ఉండడమే కాకుండా గులాబీ శ్రేణుల్లో తలలో నాలుకలా గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా వరకు ముఖ్య నేతల దగ్గరనుండా సాధారణ కార్యకర్త వరకూ ఈటల రాజేందర్ కు గౌరవం ఇస్తుంటారు. అది పార్టీలో ఈటల రాజేందర్ సాందించుకున్న మంచితనం అనుకోవచ్చు. కార్యకర్తలు, పార్టీ శ్రేణులో కాకుండా పార్టీలోని సహచర మంత్రులు, ఎంపీలు అందరూ కూడా రాజేందర్ తో సన్నిహిత సంబంధాలు కలిగిఉన్న వారే. ఈ సందర్బంగా ఓ పెళ్లి వేడుకకు వెళ్లిన ఈటల రాజేందర్ కు ఓ అరుదైన అనుభవం అకస్మాత్తుగా ఎదురైంది.

పార్టీ మారితే సంబంధాలు కట్ చేసుకునే రోజులు.. కాని కేకే మాత్రం ఈటలను ఆప్యాయంగా హగ్ చేసుకున్నారు

పార్టీ మారితే సంబంధాలు కట్ చేసుకునే రోజులు.. కాని కేకే మాత్రం ఈటలను ఆప్యాయంగా హగ్ చేసుకున్నారు

సాధారణంగా పార్టీ మారిన నాయకులు తారస పడితే చిన్న చిరునవ్వు ఓ షేక్ హాండ్ ఇస్తారు. అంతే అంతకు మించి పలకరింపులు ఉంటే మొత్తానికే బెడిసికొడుతుందని చాలా వరకు నాయకులు మితంగా వ్యవహరిస్తుంటారు. పొడి పొడి మాటలతో, కృత్రిమ నవ్వుతో ఆ ఐదు నిమిషాలు భారంగా గడిపేస్తుంటారు. ఎప్పుడు అక్కడనుంచి వెళ్లిపోదామా అని చూస్తేంటారు. కానీ పార్టీ మారినప్పటికీ పాత స్నేహం అనేది అలాగే ఉంటుందని, ఆ కోణంలో కాసేపు మాట్లాడుకోవచ్చుకదా అని అస్సలు సాహసం చెయ్యరు కొంత మంది రాజకీయ నేతలు. కాని ఓ పెళ్లిలో మాత్రం ఈటల రాజేందర్ కు మర్చిపోలేని సంఘటన ఎదురైంది.

చిగురించిన స్నేహం.. ఆలింగనం చేసుకున్న కేకే, ఈటల

ఈటల రాజేందర్ హాజరైన ఓ వివాహానికి టీఆర్ఎస్ పార్టీ సెక్రెటరీ జనరల్ కె.కేశవ రావు కూడా హాజరయ్యారు. ఈటల రాజేందర్ ను చూడగానే కేశవ రావు పాత జ్ఞాపకాలతో పులకించిపోయారు. పార్టీలు వేరైనప్పటికి స్నేహానికి గౌరవాన్నిచ్చారు కేశవరావు. ఈటల రాజేందర్ ను చూడగానే ఎదురెళ్లి గట్టిగా ఆలింగనం చేసుకుని మనస్పూర్తిగా నవ్వుకున్నారు. అంతే కాకుండా ఈటల రాజేందర్ గడ్డాన్ని నిమిరారు కేశవరావు. అంతటితో ఆగకుండా తన మాస్క్ తీసి సుతిమెత్తగా ఈటల రాజేందర్ చెంప మీద కొట్టారు. సాధించావురా భైరవా అన్నట్టు గర్వంగా ఈటల రాజేందర్ భుజం తట్టి చిరునవ్వుతో అక్కడనుండి వెనుదిరిగారు. ఇదంతా చూస్తున్న ఈటల అభిమానులు తన్మయత్వానికి గురయ్యారు. కొన్ని క్షణాలు ఈటల రాజేందర్ కూడా భావోద్వేగానికి గురైనట్టు తెలస్తోంది. మొత్తానికి ఓ వివాహ వేడుక ఇద్దరు నేతలను కలిపినట్టు వారి అనుచరుల్లో చర్చ జరుగుతోంది.

English summary
TRS party general secretary K Keshava Rao also attended a wedding attended by Itala Rajender. Keshav Rao was thrilled with old memories when he saw Itala Rajender.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X