హైదరాబాద్‌లో రెచ్చిపోయిన వైసిపి నాయకుడు, కర్రలతో వ్యక్తిపై దాడి

హైదరాబాద్: రాజధాని హైదరాబాదులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత ఒకరు రెచ్చిపోయినట్లుగా తెలుస్తోంది. ప్రత్యర్థి పైన కత్తులు, కర్రలతో దాడి చేసినట్లుగా తెలుస్తోంది. నగరంలోని జవహర్ నగర్ ప్రాంతానికి చెందిన బాల్ రెడ్డి, ఆయన అనుచరులు ఈ దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది.

బాల్ రెడ్డి వైసిపి నేతగా తెలుస్తోంది. శాస్త్రి అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఈ దాడి ఘటనలో శాస్త్రికి తీవ్ర గాయాలు కాగా అతనిని ఆసుపత్రికి తరలించారు. ఓ సైట్ (భూమి) విషయంలో గొడవ వల్లనే ఈ దాడి జరిగినట్లుగా తెలుస్తోంది.

బాల్ రెడ్డి స్థానికంగా వైసిపి నేతగా తెలుస్తోంది. ఆయనకు రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన శాస్త్రికి ఓ సైట్ విషయంలో గొడవలు వచ్చాయి. ఇది ముదిరాయి. దీంతో గురువారం నాడు కర్రలతో శాస్త్రి ఇంటికి వెళ్లి తీవ్రంగా కొట్టారు.

 Leader attacks Real estate businessman in Hyderabad

అంతేకాదు, బాల్ రెడ్డి అక్రమాలను శాస్త్రి వెలుగులోకి తెస్తున్నారని, దాడికి అందుకు కూడా కారణమని తెలుస్తోంది.
నిందితుడు బాల్ రెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. తనను హత్య చేసేందుకు బాల్ రెడ్డి కుట్ర పన్నాడని, తనకు ఏదైనా జరిగితే కారణం బాల్ రెడ్డియేనని శాస్త్రి చెబుతున్నారు.

సికింద్రాబాద్ స్టేషన్‌కు బాంబు బెదిరింపు కాల్

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ఓ అగంతకుడు గురువారం బాంబు బెదిరింపు కాల్ చేశాడు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబు స్కాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. బాంబు బెదిరింపు ఉత్తదేనని తేలింది. కాగా, విచారణలో రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన ఓ ఆకతాయి ఈ ఫోన్ చేశాడని పోలీసులు గుర్తించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+