హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెరాసలో చేరాలని బలవంతం, నేతల ఒత్తిడి, తిరగబడిన స్థానికులు!

భాగ్యనగరంలో తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వం తీసుకోవాలని బలవంతం చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అడ్డగుట్ట డివిజన్‌లోని ఆజాద్‌ చంద్రశేఖర్‌నగర్‌ బస్తీలో ఈ సంఘటన చోటు చేసుకున్నదని అంటున్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భాగ్యనగరంలో తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వం తీసుకోవాలని బలవంతం చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అడ్డగుట్ట డివిజన్‌లోని ఆజాద్‌ చంద్రశేఖర్‌నగర్‌ బస్తీలో ఈ సంఘటన చోటు చేసుకున్నదని అంటున్నారు.

కవిత ముందే నోరు జారారు: జై తెలుగుదేశం అన్న ఎంపీ మల్లారెడ్డికవిత ముందే నోరు జారారు: జై తెలుగుదేశం అన్న ఎంపీ మల్లారెడ్డి

స్థానికంగా 25 పొదుపు మహిళా సంఘాలు ఉన్నాయి. తెరాస సభ్యత్వం తీసుకోవాలని స్థానిక నేత ఒకరు వారిపై ఒత్తిడి తెస్తున్నారని చెబుతున్నారు. వారం రోజులుగా వారి వెంట పడుతున్నారని, సభ్యత్వం తీసుకోవాలంటూ బలవంతం చేస్తున్నారని అంటున్నారు.

Leader forcing to join TRS in Hyderabad

దీంతో సహనం కోల్పోయిన మహిళలు కార్పొరేటర్‌ అనుచరుడిపై మంగళవారం తిరగబడ్డారు. ఇది స్థానిక నేతలకు ఇది తలనొప్పిగా మారిందని చెబుతున్నారు.

బస్తీకి చెందిన చెందిన తెరాస నేత ఒకరు పొదుపు గ్రూపులో ఉన్న మహిళలందరూ సభ్యత్వం తీసుకోవాలంటూ ఒత్తిడి చేయడం మొదలు పెట్టారని, వారం రోజులుగా బస్తీలో హల్‌చల్‌ చేస్తున్నాడని, మంగళవారం కూడా ఇదే విధంగా సభ్యత్వం కోసం బలవంతం చేయడంతో మహిళా సభ్యులు తిరగబడ్డారు.

ఇదిలా ఉండగా, డివిజన్‌లో తెరాస సభ్యత్వం తీసుకోవాలని ఎవరిపైనా ఒత్తిడి తేవడం లేదని, తమ నేతలు ఎవరూ అలా చేయడం లేదని, ఆజాద్‌ చంద్రశేఖర్‌ నగర్‌ బస్తీలో తమ పార్టీకి చెందిన వ్యక్తికి సభ్యత్వ నమోదు పుస్తకాలు అప్పగించామని, బలవంతంగానైనా చేర్పించాలని చెప్పలేదని, దీనిపై బస్తీలో పర్యటించి వివరాలు తెలుసుకుంటానని స్థానిక కార్పోరేటర్ చెప్పారు.

English summary
It is said that one of the leader in Hyderabad is forcing to join TRS in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X