ఇక మనకు బ్రహ్మరథమే.. కేసీఆర్ భారీ ప్లాన్!
గత కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక ప్రజల్లోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు కూడా ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని కేసీఆర్ స్పష్టం చేశారు. శుక్రవారం ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో పార్టీ నేతలతో కేసీఆర్ చర్చలు జరిపారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా పార్టీ రజతోత్సవాలు, సంస్థాగ అంశాలు, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, తదితర సంబంధిత అంశాలపై పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలు ప్రతిఫలించేలా బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు ఉండాలని పార్టీ నేతలకు స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు కంకణ బద్దులమై మరింతగా బీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ సమాజ రాజకీయ అస్తిత్వ పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. బీఆర్ఎస్ తెలంగాణకు రక్షణ కవచమని చెప్పారు. పార్టీ రజతోత్సవ వేడుకలో తెలంగాణ సమాజమంతా భాగస్వాములేనని అన్నారు.
లోక్‌సభలో బీఆర్ఎస్ ప్రాతినిథ్యం లేకపోవడంతో తెలంగాణ ప్రజాప్రయోజనాలను కేంద్రం, రాష్ట్రాలు దెబ్బతీస్తున్నాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వైఖరిని తిప్పికొట్టాలని కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అంసతృప్తి ఉందన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ 27వ తేదీకి 25ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో వరంగల్ జిల్లాలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం వరంగల్ సమీపంలో సువిశాలమైన అనువైన ప్రదేశాలను పరిశీలించి త్వరలో సభా వేదిక స్థలాన్ని ప్రకటిస్తామన్నారు.
దశాబ్దాల పాటు పోరాటాలు నడిపి ఎన్నో త్యాగాలతో తెలంగాణను సాధించుకున్నామని, అనంతరం పదేండ్ల పాటు ఎంతో అప్రమత్తతో స్వరాష్ట్రంలో పాలనను దేశానికే ఆదర్శంగా నిలుపుకున్నామని, అంతటి గొప్ప ప్రగతిని సాధించిన తెలంగాణ సమాజం ఇవ్వాళ కష్టాల్లో వుందన్నారు. ఇటువంటి సందర్భంలో నిర్వహించుకుంటున్న రజతోత్సవ వేడుకలు, కేవలం బీఆర్ఎస్ పార్టీకే పరిమితం కాదని యావత్ తెలంగాణ సమాజానికి అందులో భాగస్వామ్యం వుందని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలు నిర్మించుకున్న రాజకీయ అస్థిత్వ పార్టీ. ఇది తెలంగాణ ప్రజల పార్టీ.. ప్రజలు బీఆర్ఎస్ ను తెలంగాణ పార్టీగా తమ సొంత ఇంటి పార్టీగా భావిస్తారు. ప్రజలు ఇవ్వాళ అనేక కష్టాల్లో వున్నారు. వారి రక్షణ బీఆర్ఎస్ పార్టీనే అని నమ్ముతున్నారు అని తెలిపారు.
కాంగ్రెస్ ఆశపెట్టిన గ్యారెంటీలను వాగ్దానాలను నమ్మిన ప్రజలు ఇవ్వాళ రాష్ట్ర ప్రభుత్వ నిజ స్వరూపాన్ని తెలుసుకున్నారని, ఇక ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ కు బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ అన్నారు. ఈ సందర్బంగా వరంగల్ లో నిర్వహించే భారీ బహిరంగ సభకు లక్షలాదిగా ప్రజలు తరలివస్తారని సమావేశంలో ఆశాభావం వ్యక్తమైంది.
కాగా.. బహిరంగ సభ సన్నాహక సమావేశాలను నియోజక వర్గాల వారీగా నిర్వహించాలని అందుకు త్వరలో కమిటీలను వేయనున్నట్టు కేసీఆర్ తెలిపారు. వరంగల్ బహిరంగ సభ అనంతరం.. పార్టీనీ గ్రామ స్థాయినుంచి రాష్ట్రస్థాయి వరకు సంస్థాగతంగా పటిష్ట పరిచి, ఆ దిశగా కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. ఆ తర్వాత నూతన కమిటీల బాధ్యులతో ప్రతినిధుల సభను ఏర్పాటు చేయనున్నట్టు కేసీఆర్ తెలిపారు.
పార్టీలో యువత, మహిళా భాగస్వామ్యం పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంతో పాటు, దేశంలో నడుస్తున్న వర్తమాన రాజకీయ పరిస్థితులపై అందుకనుగుణంగా పార్టీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన వ్యూహాలు అమలుచేయాల్సిన రాజకీయ ఎత్తుగడలపై లోతైన చర్చ జరిగింది. గత ఒడిదుడుకులను అనుభవాలను పరిగణలోకి తీసుకుని వాటిని విశ్లేషిస్తూ, వర్తమానానికి అన్వయించుకుంటూ భవిష్యత్తుకు బాటలు వేసుకునే విధంగా కార్యాచరణను అమలుపరచాలని సమావేశంలో నిర్ణయించారు.
కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వమున్నా కూడా, తెలంగాణ సమాజానికి మొదటినుంచి అవి వ్యతిరేకంగానే పని చేస్తున్నాయని సమావేశంలో ఆవేదన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేసుకొని దేశ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాల పట్ల నిత్యం అప్రమత్తతతో వుండాలని సమావేశం భావించింది.
తెలంగాణ ఇంటి పార్టీ ప్రాతినిథ్యం పార్లమెంటులో లేకపోవడం వలన తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లుతుందని అంశంపై చర్చ జరిగింది. ఇదే విషయాన్ని ప్రజలకు మరింతగా అర్ధం చేయించి పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలు ప్రాతినిథ్యం వుండి రాష్ట్ర హక్కులను కాపాడుకునే దిశగా ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించాలని సమావేశంలో నిర్ణయించారు.
కాగా, పలు అంశాలపై చర్చ సందర్బంగా అధినేత కేసీఆర్ అందరి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో పాల్గొన్న నేతలు వారి వారి అభిప్రాయాలను అధినేత ముందుంచారు. దాదాపు ఎనిమిది గంటల పాటు సాగిన సుధీర్ఘ చర్చలో.. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఖరులను తిప్పి కొడుతూ తెలంగాణ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా భారీ బహిరంగ సభను నిర్వహించాలని కేసీఆర్ అధ్యక్షతన సాగిన సమావేశం నిర్ణయించింది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications