మందుబాబులకు గుడ్‌న్యూస్: మద్యం ధరలు తగ్గించిన ప్రభుత్వం, బీర్‌పై మాత్రం!
హైదరాబాద్: మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్‌చెప్పింది. రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గించినట్లు శుక్రవారం ప్రభుత్వం వెల్లడించింది. మద్యంపై ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో బీర్(Beer) మినహా లిక్కర్‌కు చెందిన అన్ని బ్రాండ్లపై ధరలు తగ్గాయి.

ఫుల్ బాటిల్‌పై రూ. 40, హాఫ్ బాటిల్‌పై రూ. 20, క్వార్టర్ బాటిల్‌పై రూ. 10 చొప్పున ధరలు తగ్గాయి. కొన్ని రకాల బ్రాండ్స్ ఫుల్ బాటిల్స్‌పై రూ. 60 వరకు తగ్గించినట్లు రాష్ట్ర అబ్కారీ అధికారులు తెలిపారు. తగ్గిన ధరలు ఇవాళ్టి(మే 05) నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు.
మద్యం అధిక ధరల కారణంగా బయటి రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి లిక్కర్ అక్రమంగా వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అక్రమ మద్యం రవాణాను నియంత్రించేందుకే ప్రభుత్వం లిక్కర్ ధరలు తగ్గించినట్లు అబ్కారీ అధికారులు స్పష్టం చేశారు.
శుక్రవారంనుంచి తయారయ్యే మద్యం బాటిళ్లపై తగ్గిన ధరలు ప్రింట్ అవుతాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు లిక్కర్ తయారీ కంపెనీలకు ఆదేశాలు ఇచ్చినట్లు వారు వెల్లడించారు. కాగా, ఈ తగ్గించిన ధరలు సోమవారం నుంచి కొత్తగా కొనుగోలు చేసిన మద్యం బాటిళ్లపై వర్తిస్తాయని తెలంగాణ బేవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గజ్జెల నాగేశ్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications