మందుబాబులకు షాక్, మద్యం ధరల బాదుడు - బ్రాండ్లు.. కొత్త ధరలు..!!

మందుబాబులకు బిగ్ షాక్. మద్యం ధరలు భారీగా పెంపుకు రంగం సిద్దమైంది. ఈ మేరకు ఇప్పటి కే కొత్త ధరలు ఖరారు చేసారు. అన్ని రకాల మద్యం, బీర్ల ధరలు పెరగనున్నాయి. కొంతకాలంగా మద్యం తయారీ కంపెనీల నుంచి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి వస్తోంది. దీంతో, అనేక తర్జన భర్జన తరువాత మద్యం ధరల పెంపు పైన నిర్ణయం తీసుకున్నారు. బ్రాండెడ్ మద్యం.. బీర్ల ధరలు భారీగా పెరగనున్నాయి. కొత్త ధరల పెంపు అమలు ముహూర్తం సైతం ఖరారు చేసారు.

తెలంగాణ ప్రభుత్వం మద్యం ధరల పెంపుకు తుది కసరత్తు చేస్తోంది. మద్యం ధరల పెంపు దిశ గా ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి.రాష్ట్రంలో త్వరలోనే అన్ని రకాల మద్యం, బీర్ల ధరలు పెరగనున్నాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 తర్వాత ధరల పెంపుపై అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే వీటి పైన ప్రభుత్వం నియమించిన ధరల నిర్ధారణ కమిటీ సమీక్ష చేసింది. ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. నివేదిక లో పేర్కొన్న అంశాల మేరకు ధరల పైన ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. అందులో భాగంగా బ్రాండెడ్ మద్యం.. బీర్ల ధరల పెంపు ఖాయమని తెలుస్తోంది. ఇరాన్ యుద్ధ ప్రభావంతో గాజు తయారీకి అవసరమైన ఎల్పీజీ కొరత ఏర్పడిందని, ఎక్కువ ధరకు కొనాల్సి వస్తున్నదని, ఉత్పత్తి వ్యయం పెరిగినందున కనీసంగా 15 శాతం పెంచాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు డిస్టిల్లరీలు, బ్రూవరీలు ఇప్పటికే విజ్ఞప్తి చేశాయి.

త్రిషకు విజయ్ ఊహించని పదవి,కేరాఫ్ ఢిల్లీ - అక్కడే అసలు ట్విస్ట్..!!
త్రిషకు విజయ్ ఊహించని పదవి,కేరాఫ్ ఢిల్లీ - అక్కడే అసలు ట్విస్ట్..!!
liquor-prices-to-hike-in-telangana-after-june-up-to-10-15-percent-as-excise-latest-proposals

జూన్ 2 తరువాత పెంపు

గత కొంతకాలంగా మద్యం తయారీ కంపెనీల నుంచి ధరల పెంపు పైన ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి వస్తోంది. ముడిసరుకుల ధరలు, ముఖ్యంగా సీసాల తయారీ ఖర్చు పెరగడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. పశ్చిమాసియా యుద్ధం, కమర్షియల్ గ్యాస్ ధరలు రెట్టింపు కావడం వంటి కారణాలతో సీసాల తయారీ వ్యయం 15 నుంచి 20 శాతం వరకు పెరిగిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ధరలను సవరించాలని కంపెనీలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
మద్యం ధరల పెంపు, ఆదాయ వనరులపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం గతంలోనే ఓ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, పొరుగు రాష్ట్రాల్లోని ధరలను విశ్లేషించిన ఈ కమిటీ రాష్ట్రంలో 25 నుంచి 30 శాతం వరకు ధరలు పెంచవచ్చని ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఒకేసారి ఇంత భారీగా పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న ఆలోచనతో ప్రభుత్వం సుమారు 10 నుంచి 15 శాతం మేరకే పెంపునకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా సాధారణ, మీడియం బ్రాండ్లతో పాటు ప్రీమియం బ్రాండ్ల ధరలు కూడా పెరగనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+