Liquor: చలికాలంలో కూడా బీర్లను నీళ్లలా తాగారు.. ఎందుకంటే..!
తెలంగాణలో మద్యం ఏరులై పారుతోంది. ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా మద్యం మంచి నీళ్లలా తాగేశారు. ఇంకా చెప్పాలంటే.. నీళ్ల కుంటే మద్యమే ఎక్కువ తాగారని చెప్పొచ్చు. ఇందుకు లిక్కర్ సేల్స్ భారీగా పెరగడమే నిదర్శనం. ఎన్నికల నేపథ్యంలో వైన్ షాపులకు భారీగా గిరాకీ వచ్చింది. ముఖ్యంగా తెలంగాణలో రికార్డు స్థాయిలో బీర్లు అమ్ముడుపోయాయి. ఎమ్మెల్యే అభ్యర్థులు భారీగా మద్యాన్ని ఓటర్లకు పంపిణీ చేశారు.
ఎక్కువ శాతం బ్రాండ్ లిక్కర్ తో పాటు బీర్లు తాగేశారు. 2023 నవంబర్ నెలలో 27 రోజులకు 21 లక్షల 69 వేల కేసుల లిక్కర్ సేల్స్ అయ్యాయి. అంతేకాకుండా 30 లక్షల 44 వేల కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. అంటే రోజుకు దాదాపుగా రోజుకు లక్ష బీర్ల కేసులను విక్రయించారు. దాదాపుగా మూడు కోట్ల విలువైన బీర్లను తాగారని గణాంకాలను బట్టి తెలుస్తోంది.నవంబర్ 1 నుంచి నవంబర్ 20 మధ్య తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 22 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.

గత ఏడాది ఇదే టైమ్ లో దాదాపు 12 లక్షల కేసులు బీర్లు మాత్రమే అమ్ముడుపోయాయి. ఎన్నికల వేళ రాష్ట్రంలో మూడు నెలల్లో దాదాపు రూ.8,900 కోట్ల విలువైన మద్యాన్ని విక్రయించారు. సాధారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలా 28 నుంచి 30 లక్షల కేసుల బీర్లు అమ్ముడవుతాయి. వేసవి కాలంలో బాగా పెరగటం సహజం.ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ మూడు నెలల్లో రూ.9,032 కోట్ల విలువైన బీర్లు, లిక్కర్ సేల్స్ పెరిగాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,620 మద్యం దుకాణాల లైసెన్సు గడువు గురువారంతో ముగిసింది. ఇటీవల నిర్వహించిన టెండర్లలో షాపులు దక్కించుకున్నవారు శుక్రావారం నుంచి రెండేండ్ల పాటు మద్యం దుకాణాలను నిర్వహించనున్నారు. వీటిల్లో రిజర్వేషన్ ద్వారా 786 మద్యం దుకాణాలు గౌడ్స్, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించారు.












Click it and Unblock the Notifications