వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

3 విడతల్లో స్థానిక ఎన్నికలు..! రిజర్వేషన్ల లెక్క తేలాకే ఎన్నికలు నిర్వహించాలంటున్న బీసి సంఘం..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వమిస్తామని, ఈ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ మధ్య నోటిఫికేషన్ జారీ చేస్తామని వెల్లడించారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి. నాగిరెడ్డి. మాసబ్‌ట్యాంక్‌లోని రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అయితే రిజర్వేషన్ల ప్రక్రియపై హై కోర్టులో కేసు ఉన్నందున, ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర బీసి సంఘం డిమాండ్ చేస్తోంది.

స్థానిక సమరానికి అంతా సిద్దం..! మూడువిగతల్లో పోలింగ్..!!

స్థానిక సమరానికి అంతా సిద్దం..! మూడువిగతల్లో పోలింగ్..!!

ఎన్నికల నాటికి పోలింగ్‌ స్టేషన్లు సిద్ధం అవుతాయి. పోలింగ్‌ సిబ్బంది నియామకం పూర్తయింది. ఆర్వోలు, ఏఆర్వోల శిక్షణ పూర్తి చేశామన్నారు. ప్రభుత్వ ముఖ్య విభాగాల ఉన్నతాధికారులతో సమావేశం అయ్యాం, 18న కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో సమావేశం అవుతామని తెలిపారు నాగిరెడ్డి. పోలింగ్ కేంద్రాల గుర్తింపు జరిగిపోయిందని.. అయితే, బ్యాలెట్ పేపర్ల ముద్రణ కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందన్నారు.

స్థానిక సమరానికి బీసి సంఘం అభ్యంతరం..! కోర్ట్ తీర్పు తర్వాతే నిర్వహించాలని డిమాండ్..!!

స్థానిక సమరానికి బీసి సంఘం అభ్యంతరం..! కోర్ట్ తీర్పు తర్వాతే నిర్వహించాలని డిమాండ్..!!

ఇక ఇప్పటికే ఓటర్ల జాబితా అన్ని రాజకీయ పార్టీలకు అందజేసినట్టు తెలిపారు ఎన్నికల కమిషనర్.. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే వరకు ఓటరు లిస్టులో పేరు కోసం దరఖాస్తు చేసుకున్న అందరి పేర్లు జాబితాలో చేరుస్తామని తెలిపారు.ఈ నెల 20వ తేదీ లోపు అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తామని తెలిపారు. నోటిఫికేషన్‌లో అన్ని వివరాలు అందజేస్తాం. నోటిఫికేషన్‌ కాపీలను కూడా అందజేస్తామని తెలిపారు.

ఎన్నికలు వాయిదా వేయాలి..! రిజర్వేషన్ల కోటా తేలిన తర్వాతే నిర్వహించాలన్న ఆర్ క్రిష్ణయ్య..!!

ఎన్నికలు వాయిదా వేయాలి..! రిజర్వేషన్ల కోటా తేలిన తర్వాతే నిర్వహించాలన్న ఆర్ క్రిష్ణయ్య..!!

ఇదిలా ఉండగా ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర బీసి సంఘం డిమాండ్ చేస్తోంది. ఎన్నికల్లో రిసర్వేషన్ల ప్రక్రియ సరిగా లేనందును. శస్త్రీయంగా ఎన్నికల బీసి రిజర్వేషన్ల ప్రక్రియ ముడిసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహాంచాలని బీసి సంఘం డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కు బీసి సంఘం జాతీయ అద్యక్షుడు ఆర్ క్రిష్ణయ్య లేఖ రాసారు.

ఎన్నికలపై పంచాయతీ శాఖకు బీసి సంఘం లేఖ..! ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని సూచన..!!

ఎన్నికలపై పంచాయతీ శాఖకు బీసి సంఘం లేఖ..! ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని సూచన..!!

బీసి రిజర్వేషన్ల ప్రక్రియకు సంబందించిన కేసు న్యాయ స్థానంలో ఉందని, తుది తీర్పు వచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని లేఖలో ఆర్ క్రిష్ణయ్య పేర్కొన్నారు. గతంలో 34శాతం ఉన్న బీసి రిజర్వేషన్లను 22శాతానికి తగ్గించి ఎన్నికలు నిర్వమించారని, ఇది వెనుకబడిన వర్గాలను కించపరచడమేనని క్రిష్ణయ్య పేర్కొన్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసి రిజర్వేషన్ల కోటా తగ్గకుండా ఉండేందుకు ఆయన కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు.

English summary
District Parishad and Mandala Parishad will be held in three phases and will be issued notification between 18th and 20th of this month.election commissioner Nagi Reddy spoke at a meeting that all the arrangements have been made for the zptc and the MPTc elections. But since the High Court has a case on reservation process, the state BC Organisation is demanding that the election be postponed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X