Owaisi vs Modi:ముస్లింలే ఎక్కువ పిల్లలను కంటున్నారా..మోదీ,షా,యోగీ సంగతేంటి..?

Akbaruddin Owaisi:తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మే 13న ఇటు ఏపీ అటు తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.పోలింగ్‌కు రోజులు దగ్గరపడుతుండటంతో నాయకుల మధ్య మాటల తూటాలు గట్టిగా పేలుతున్నాయి. కొన్ని సార్లు ఆ మాటలు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించేలా ఉంటున్నాయి. ఇక తాజాగా మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రధాని మోదీ పై చేసిన వ్యాఖ్యలు హెడ్‌లైన్స్‌లో నిలిచాయి. ఇంతకీ అక్బరుద్దీన్ ప్రధాని మోదీని ఎలా టార్గెట్ చేశారు..?

హైదరాబాద్ నగరంలో లోక్‌సభ ఎన్నికల వేడి మామూలుగా లేదు. ఇక్కడ ముక్కోణపు పోటీ నెలకొంది. ఓవైపు కాంగ్రెస్ మరోవైపు బీజేపీ ఇంకోవైపు బీఆర్ఎస్‌లు అయితే హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో మాత్రం మజ్లిస్ పార్టీ తనదైన ముద్ర వేస్తోంది. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏఐఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ముస్లింలు ఇతర మతాల వారు కంటున్న పిల్లల గురించి ప్రస్తావిస్తూ ఒక్కింత హాట్ కామెంట్స్ చేశారు. ప్రధాని మోదీ పిల్లల గురించి, అలాగే దేశంలోకి అక్రమంగా చొరబడుతున్న వారిగురించి ప్రస్తావించారు. దీనిపై మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఘాటు కౌంటర్ ఇచ్చారు.

Loksabha election 2024 Akbaruddin Owaisi Takes On PM Modis Remark Regarding Children

ముస్లింలు మాత్రమే కంటున్నారా..?

ప్రధాని మోదీ పరోక్షంగా ముస్లింల గురించే ప్రస్తావించారన్న అక్బరుద్దీన్... కేవలం ముస్లింలు మాత్రమే పిల్లలను అధికంగా కంటున్నారా, ముస్లింలు మాత్రమే దేశంలోకి అక్రమంగా చొరబడుతున్నారా అంటూ ప్రశ్నించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పాయికి 7 మంది సోదరులు సోదరీమణులు ఉన్నారనే విషయం తెలుసా.. యోగీ తల్లిదండ్రులకు కూడా ఏడుగురు సంతానం ఉండగా.. అమిత్ షాకు కూడా ఏడుగురు సోదరసోదరీమణులున్నారని అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. మోదీ తల్లి కూడా ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చిందని గుర్తుచేశారు.

దేశానికి అందమైన కట్టడాలు

దేశానికి చారిత్రక కట్టడాలుగా చెప్పుకుంటున్న తాజ్‌మహల్, కుతుబ్ మినార్, ఎర్రకోట, జామా మసీదు, చార్మినార్‌ నిర్మాణాలను ముస్లింలే నిర్మించారని చెప్పుకొచ్చారు. దేశాన్ని అందంగా సుందరంగా తీర్చిదిద్దిందే ముస్లింలు అని చెప్పిన అక్బరుద్దీన్.. తాము చొరబాటుదారులమని చెప్పడాన్ని తప్పుబట్టారు. ఈ దేశం తమదే అని ఇకపై కూడా భారత్ తమ దేశంగానే ఉంటుందని అన్నారు.

Loksabha election 2024 Akbaruddin Owaisi Takes On PM Modis Remark Regarding Children

అసలేం జరిగింది:

రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోన్న ప్రధాని మోదీ ముస్లింలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్‌లోకి చొరబడేవారు ముస్లింలని చెబుతూ... ఇండియా కూటమి దేశంలోని సంపదను అధికంగా పిల్లలున్న ముస్లిం కుటుంబాలకు పంచేందుకు సిద్ధమైందనే వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు దేశ వనరులపై తొలి హక్కు ముస్లింలకే ఉంటుందన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలను ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలు, ముస్లిం సంఘాలు భగ్గుమన్నాయి.ముస్లింలపై మోదీ విషం కక్కుతున్నారని ప్రతిపక్షాలు, ఇతర ముస్లిం సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.ప్రధాని మోదీ హింసను ప్రేరేపించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ మండిపడింది.

మొత్తానికి ప్రధాని మోదీ వ్యాఖ్యలు ఇటు దేశంలో అటు బయటదేశాల్లోను పెద్ద చర్చకే దారితీస్తున్నాయి. ఇప్పటికే తొలిదశ ఎన్నికలు పూర్తికాగా.. మిగతా విడతలు కూడా పూర్తయ్యేసరికి ఇంకెన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ఈ రాజకీయనాయకులు చేస్తారో అని సామాన్య ప్రజలు, ఓటర్లు చర్చించుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+