లోకసభ ఎన్నికలు 2019: మహబూబాబాద్ నియోజకవర్గం గురించి తెలుసుకోండి

తెలంగాణ రాష్ట్రంలోని 17 లోకసభ నియోజకవర్గాల్లో మహబూబాబాద్ ఒకటి. ఈ నియోజకవర్గం షెడ్యూల్ ట్రైబల్స్‌కు రిజర్వ్ చేయబడినది. ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దీని పరిధిలోని ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ఎస్టీలకు రిజర్వ్ చేయబడినాయి. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో మహబూబాబాద్ ఏర్పడింది.
మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 1957, 1962లలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి మధుసూదన్ రావు పోటీ చేసి విజయం సాధించారు. 2009లో అదే కాంగ్రెస్ పార్టీ నుంచి బలరాం నాయక్ గెలుపొందారు. ఆయన కేంద్రమంత్రిగా కూడా పని చేశారు. 2014లో పదహారవ లోకసభకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నుంచి పోటీ చేసిన ప్రొఫెసర్ అజ్మీరా సీతారామ్ నాయక్ విజయం సాధించారు.
మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గం పరిధిలో 13,87,343 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 6,88,398 కాగా, మహిళా ఓటర్లు 6,98,945. ఈ నియోకవర్గం పరిధిలో జనాభా 18,41,050. ఇందులో గ్రామీణ ప్రాంత జనాభా శాతం 87.01% కాగా, పట్టణ ప్రాంత జనాభా శాతం 12.99%. ఇక్కడ ఎస్టీలు ఎక్కువ. 35.87% మంది ఎస్టీలు ఉన్నారు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గం నుంచి ప్రొఫెసర్ అజ్మీరా సీతారామ్ నాయక్ గెలుపొందారు. ఈయన తెరాస నుంచి విజయం సాధించారు. వృత్తిరీత్యా ప్రొఫెసర్.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ పైన టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన సీతారాం నాయక్ 34,992 ఓట్ల మెజార్టీతో గెలిచారు. సీతారాం నాయక్‌కు 3,20,569 ఓట్లు వస్తే, బలరాం నాయక్‌కు 2,85,577 ఓట్లు వచ్చాయి. టీడీపీ నుంచి పోటీ చేసిన బానోత్ మోహన్ లాల్ కూడా మంచి ఓట్లే సాధించారు. ఈయనకు 2,15,904 ఓట్లు వచ్చాయి. 2014లో పలు పార్టీల నుంచి, స్వతంత్రులు కలిసి పదిహేడు మంది పోటీ చేశారు.
ఎంపీ సీతారామ్ నాయక్ పార్లమెంటులో 134 ప్రశ్నలు అడిగారు. తెలంగాణ రాష్ట్ర యావరేజ్ 285గా, జాతీయ యావరేజ్ 273గా ఉంది. పార్లమెంటుకు హాజరు 71 శాతంగా ఉంది. ఇది తెలంగాణ రాష్ట్ర యావరేజ్ 69 శాతంగా ఉంది. 28 చర్చల్లో పాల్గొన్నారు. జాతీయ యావరేజ్ 63.8గా, తెలంగాణ యావరేజ్ 36.7గా ఉంది. సీతారామ్ నాయక్ నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం రూ.18.51 కోట్లు ఖర్చు చేశారు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 11,24,370 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే 81 శాతం మంది ఓటు వేశారు. ఇందులో పురుష ఓటర్లు 5,62,073, మహిళా ఓటర్లు 5,62,297 ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో ఎస్టీల జనాభా మూడొంతుల కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది. 2014 సీతారామ్ నాయక్ (టీఆర్ఎస్) చేతిలో ఓడిపోయిన బలరాం నాయక్ (కాంగ్రెస్) 2009లో విజయం సాధించారు. అప్పుడు ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన డీటీ నాయక్ మూడోస్థానంలో నిలిచారు. ఇక్కడ లెఫ్ట్ ప్రభావం కూడా ఎక్కువే. 2009 ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి కుంజా శ్రీనివాస రావు రెండోస్థానంలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్‌కు గట్టి పోటీ ఇచ్చారు.