లోకసభ ఎన్నికలు 2019: జహీరాబాద్ నియోజకవర్గం గురించి తెలుసుకోండి
Recommended Video

తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో జహీరాబాద్ ఒకటి. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో ఇది ఏర్పడింది. 2009లో తొలిసారి ఈ నియోజకవర్గానికి ఎన్నిక జరిగింది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున సురేష్ కుమార్ షేట్కార్ విజయం సాధించారు. 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నుంచి బీబీ పాటిల్ గెలుపొందారు. ఈ లోక్‌సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాలలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలు దీని పరిధిలోకి వస్తాయి.
2009లో కాంగ్రెస్ నుంచి సురేష్ షేట్కార్, ప్రజారాజ్యం పార్టీ తరఫున శివకుమార్, తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున సయ్యద్ యూసుఫ్ అలీ గెలిచారు. ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో (2014) బీబీ పాటిల్ గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షేట్కార్ పైన 1,44,631 ఓట్ల మెజార్టీతో పాటిల్ విజయం సాధించారు. టీడీపీ నుంచి మదన్ మోహన్ రావు (1,57,497 ఓట్లు), వైసీపీ నుచి మహమూద్ మోహియుద్దీన్ (12,383), బీఎస్పీ నుంచి సయ్యద్ ఫిరోజుద్దీన్ (8,180 ఓట్లు) వచ్చాయి. నోటాకు 11,157 ఓట్లు వచ్చాయి.
బీబీ పాటిల్‌కు 5,08,661 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి షేట్కార్‌కు 3,64,030 ఓట్లు వచ్చాయి. తెరాసకు 46.46 శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీకి 33.25 శాతం ఓట్లు వచ్చాయి.
బీబీ పాటిల్ గ్రాడ్యుయేట్. అగ్రికల్చర్‌లో బీఎస్సీ చేశారు. ఎంపీగా తొలిసారి విజయం సాధించారు. లోక్‌సభలో 41 చర్చల్లో పాల్గొన్నారు. చర్చల్లో తెలంగాణ ఎంపీల యావరేజ్ 36.7 శాతం, నేషనల్ యావరేజ్ 63.8గా ఉంది. పాటిల్ ప్రయివేటు మెంబర్ బిల్స్ ప్రవేశపెట్టలేదు. సభలో 409 ప్రశ్నలు అడిగారు. ఇది తెలంగాణ యావరేజ్ 285, నేషనల్ యావరేజ్ 273గా ఉంది. పాటిల్ హాజరు శాతం 79గా ఉంది. తెలంగాణ యావరేజ్ 69 శాతంగా ఉంది. నియోజకవర్గ అభివృద్ధి పనుల నిమిత్తం ఎంపీ లాడ్స్ నుంచి రూ.12.84 కోట్లు ఖర్చు చేశారు.

జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 14,45,246 ఓటర్లు ఉన్నారు. ఇందులో 7,17,811 పురుష ఓటర్లు, 7,27,435 మహిళా ఓటర్లు. గత లోక్‌సభ ఎన్నికల్లో 10,94,806 ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో 5,46,746 పురుష ఓటర్లు, 5,48,060 మహిళా ఓటర్లు ఓటు వేశారు. ఈ నియోజకవర్గం పరిధిలోని జనాభా 20,40,339. ఇందులో గ్రామీణ ప్రాంతంలో 87.92% శాతం మంది, పట్టణ ప్రాంతంలో 12.08% శాతం మంది ఉన్నారు. ఇందులో ఎస్సీల శాతం 17.79% కాగా, ఎస్టీల శాతం 8.38%గా ఉంది.
జహీరాబాద్ ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఓ పట్టణం. 9వ జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని షోలాపూర్ వెళ్లే దారిలో ఉంది. హైదరాబాద్ నుంచి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో జహీరాబాద్ ఉంటుంది. జహీరాబాద్ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కువగా వ్యవసాయం జీవనోపాధి. ఉపాధి కల్పించే పరిశ్రమలు కూడా ఉన్నాయి. కర్ణాటక సరిహద్దుల్లో ఉంటుంది. దీంతో కన్నడవాసులు ఎక్కువే.












Click it and Unblock the Notifications