ప్రేమ పేరుతో యువకుడి మోసం: యువతి ఆత్మహత్య
వరంగల్: జిల్లాలోని చెన్నారావుపేట మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని మోసం చేయడంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. పాపయ్యపేట గ్రామశివారు బీసీకాలనీకి చెందిన జాటోత్ ఈర్య కుమార్తె జాటోత్ శోభ(18) టైలరింగ్ పనిచేస్తోంది. ఈ క్రమంలో గూడూరు మండలం గుండెంగ గ్రామశివారు దొడ్డితండాకు చెందిన గుగులోత్ బాలుతో పరిచయం ఏర్పడింది.

బాలు బీటెక్ చదువుతున్నాడు. వీరిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. రెండేళ్లుగా వీరు ప్రేమించుకుంటుంన్నారు. శనివారం ఉదయం శోభ తనకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని మనం పెళ్లి చేసుకుందామని బాలుకు ఫోన్‌చేసింది. దీంతో బాలు తాను పెళ్లి చేసుకోనని ఏం చేసుకుంటావో చేసుకో అని దురుసుగా సమాధానం చెప్పాడు.
దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన శోభ ఇంట్లో ఉన్న క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్సనిమిత్తం నర్సంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శోభ మృతిచెందింది. మృతురాలి తండ్రి జాటోత్ ఈర్య ఫిర్యాదుమేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications