లలిత జ్యూయల్లరీ చోరీ: రెండోసారి వచ్చి పోలీసులకు చిక్కారు, పేస్‌బుక్ ద్వారా ప్రేమాయణం
హైదరాబాద్: లలిత జ్యూయల్లరీ దుకాణంలో బంగారు ఆభరణాలను చోరీ చేసిన ప్రేమ పక్షులు... మరోసారి అదే దుకాణంలోకి వచ్చారు. అయితే రెండోసారి దుకాణంలోకి వచ్చి తిరిగి వెళ్ళారు. సీసీటీవి కెమెరాలో అనుమానాస్పదంగా తిరిగిన ఈ ప్రేమ జంటపై ఆరా తీస్తే చోరీకి పాల్పడిన ఘటన వెలుగు చూసింది.
Recommended Video

లలిత జ్యూయల్లరీ దుకాణంలో వారంలో రెండోసారి బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. అయితే ఈ బంగారు ఆభరణాల చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు దుకాణ యాజమాన్యం. అయితే ఈ చోరీకి పాల్పడిన ప్రేమ జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల అరెస్ట్‌లో సీసీ కెమెరా కీలకంగా వ్యవహరించింది.
లలిత జ్యూయల్లరీ దుకాణంలో ఒకసారి చోరీకి పాల్పడిన ప్రేమ జంట మరోసారి వచ్చి అడ్డంగా బుక్కయ్యారు. అయితే లలిత జ్యూయల్లరీ దుకాణంలో సెక్యూరిటీ సరిగా లేదని పోలీసులు నోటీసులు కూడ జారీ చేశారు.

రెండో సారి లలిత జ్యూయల్లరీకి వచ్చి దొరికారు
కృష్ణా జిల్లా నందిగామకు చెందిన షేక్ కరీముల్లా బీటెక్ పూర్తిచేసి ఉద్యోగం కోసం హైద్రాబాద్‌కు వచ్చారు.. కర్నూలు పట్టణానికి చెందిన వాణిక్రాంతి డిప్లొమా చేసి నగరానికి వచ్చి బాలికల హాస్టల్‌లో ఉంటోంది. వీరిద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది. అయితే తమ అవసరాలను తీర్చుకొనేందుకు దొంగతనం చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. లలిత జ్యూయల్లరీ దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. సిబ్బంది కనుగప్పి రెండు జతల గాజులు,ఒక బ్రాస్‌లెట్ చోరికి పాల్పడ్డారు.అయితే వీటిని చోరికి పాల్పడిన తర్వాత దుకాణం నుండి ఉడాయించారు. కొద్దిసేపటికే మరోసారి దుకాణంలోకి వచ్చి కలియతిరిగి వెళ్ళారు. అయితే సీసీటీవి కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.

సీసీ దృశ్యాల ఆధారంగా పోలీసుల దర్యాప్తు
అక్టోబరు 11న సోమాజిగూడలోని లలిత ఆభరణాల దుకాణంలో ప్రేమ జంట బంగారు ఆభరణాలను చోరీ చేసిన తర్వాత తాము నివాసం ఉండే హస్టళ్ళకు వెళ్ళారు. అయితే లలిత జ్యూయల్లరీ దుకాణం నుండి రహదారి వెంటన ఉన్న సీసీ టీవీ పుటేజీని పోలీసులు పరిశీలించారు.ప్యారడైజ్ దగ్గరలోని సింధి కాలనీ హాస్టల్ పరిసరాల్లోకి నిందితులు వెళ్ళినట్టు పోలీసులు గుర్తించారు. అక్కడ నిఘా వేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తే అసలు విషయం వెలుగుచూసింది.

ఫేస్‌బుక్ ద్వారా స్నేహితులు
కృష్ణా జిల్లా నందిగామకు చెందిన షేక్ కరీముల్లా, కర్నూల్ కు చెందిన వాణీ క్రాంతి ఉద్యోగం కోసం హైద్రాబాద్‌కు వచ్చారు. అయితే వీరిద్దరూ కూడ ఫేస్‌బుక్ ద్వారా స్నేహితులయ్యారు. వీరిద్దరి మధ్య స్నేహం కాస్తా ప్రేమగా మారింది. అయితే తమ ఆర్ధిక అవసరాల కోసం దొంగతనం చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. అయితే లలిత జ్యూయల్లరీని ఎంచుకొన్నారు. అయితే తొలి ప్రయత్నంలోనే వారు సక్సెస్ అయ్యారు. దొంగిలించిన ఆభరణాలను నందిగామలోని ముత్తూట్ ఫైనాన్స్‌లో రూ.1.32లక్షలకు తాకట్టు పెట్టారు.

లలిత జ్యూయల్లరీ దుకాణంలో సెక్యూరిటీ లోపం
లలిత జ్యూయల్లరీ దుకాణంలో సెక్యూరిటీ లోపం ఉందని పోలీసులు గుర్తించారు. ఈ నిఘా లోపాన్ని ఆసరాగా చేసుకొని నిందితులు సులభంగా బంగారు ఆభరణాలను దోపిడి చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసులు లలిత జ్యూయల్లరీ దుకాణ యజమానికి నోటీసులు జారీ చేశారు. లలిత జ్యూయల్లరీ దుకాణంలో బురఖా ధరించి దోపిడికి పాల్పడిన ఇద్దరిని ఇంతవరకు గుర్తించలేదు.












Click it and Unblock the Notifications