విషాదం: గుడిలో పెళ్లి చేసుకున్నారు, చెట్టుకు ఉరేసుకున్నారు
ఓ ప్రేమ వివాహం విషాదంతో ముగిసింది. ప్రేమికులు గుడిలో పెళ్లి చేసుకుని, ఆ తర్వాత చెట్టుకు ఉరేసుకుని మరణించారు. మూడేళ్లుగా ప్రేమించుకున్న వారు పెద్దలు పెళ్లికి అడ్డు చెప్పడంతో ఆ పనికి ఒడిగట్టారు.
మెదక్: ఓ ప్రేమ వివాహం విషాదంతో ముగిసింది. ప్రేమికులు గుడిలో పెళ్లి చేసుకుని, ఆ తర్వాత చెట్టుకు ఉరేసుకుని మరణించారు. మూడేళ్లుగా ప్రేమించుకున్న వారు పెద్దలు పెళ్లికి అడ్డు చెప్పడంతో ఆ పనికి ఒడిగట్టారు.ఈ విషాద సంఘటన మెదక్‌జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్‌లో చోటుచేసుకుంది.
బస్వాపూర్ గ్రామానికి చెందిన నాచారం రమేశ్(25) తల్లి సుగుణమ్మతో కలిసి మూడేళ్ల క్రితం దూలపల్లికి వలస వచ్చారు. సంగారెడ్డిపుల్కల్ మండలం రంగోజిపేట గ్రామానికి చెందిన కుమ్మరి లింగం, లక్ష్మిలు కూడా దూలపల్లికి వలస వచ్చారు. ఈ క్రమంలో ఎన్‌ఆర్‌ఐ కాలేజీలో ఇంటర్ చదువుతున్న లింగం కూతురు మాధవి(17)తో రమేశ్‌కు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.

వారి ప్రేమ విష యం ఇటీవల ఇరువురి ఇళ్లలో తెలిసింది. దీంతో నెల క్రితం గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించినట్లు రమేశ్ సోదరుడు మధు తెలిపాడు. ఆరు నెలల్లో మాధవి మేజర్ కావడంతో పాటు ఇంటర్ కూడా పూర్తవుతుందని, తర్వాత ఇరువురికి పెళ్లి చేయాలని పంచాయతీలో నిర్ణయించారని చెప్పాడు.
అయితే, శనివారం ఉదయం నుంచి తన సోదరుడు కనిపించలేదని మధు ఆవేదన వ్యక్తం చేశాడు. హైదరాబాద్ నుంచి శనివారం సాయంత్రం వెల్దుర్తికి చేరుకున్న మాధవి, రమేశ్ గ్రామ శివారులోని మల్లన్నగుట్ట ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం పక్కనే ఉన్న చెట్టుకు ఉరివేసుకున్నారు.
ఆదివారం ఉదయం వంట చెరుకుకోసం అటువైపు వెళ్లిన మహిళలు మృతదేహాలను చూశారు. దీంతో వారి ఆత్మహత్య సంఘటన వెలుగు చూసింది. గ్రామస్తుల సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు.












Click it and Unblock the Notifications