భార్యను వీడలేక, ప్రేయసితో ఉండలేక: ప్రేయసితో కలిసి ఆత్మహత్య

వరంగల్: భార్యను కాదనలేక, ప్రేయసిని వదులుకోలేక సతమతమైన ఓ వ్యక్తి ప్రేయసితో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. ముగ్గురం కలిసి ఉందామనే ప్రతిపాదనకు భార్య అంగీకరించలేదు. వరంగల్ జిల్లా గీసుగొండ మండల పరిధిలోని ధర్మారం సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య ఇద్దరు ప్రేమికులు బీమానాగుల సతీష్‌(37), గాండ్ల సింధూర (24)ఆత్మహత్య చేసుకున్నారు.

రైల్వే పోలీసుల కథనం ప్రకారం ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. వరంగల్ నగరంలోని కాశిబుగ్గ ప్రాంతానికి చెందిన సతీష్‌కు ములుగు ప్రాంతానికి చెందిన సంగీతతో 2008లో పెళ్లయింది. వీరికి 6సంవత్సరాల పాప ఉంది. ప్రస్తుతం సతీష్‌ విశాఖపట్నంలో సామ్‌సంగ్‌ కంపెనీలో ఉద్యో గం చేసుకుంటూ భార్య, కూతురుతో కలిసి ఉంటున్నాడు. అ

అతడికి నగరంలోని జాన్‌పాక ప్రాంతానికి చెందిన గాండ్ల సింధూరతో ప్రేమ వ్యవహారం ఏర్పడింది. ఆమె నగరంలోని ఓ కళాశాలలో ఎంబీఏ చదువుతోంది. ఈ విషయం సంగీత దృష్టికి రావటంతో కుటుంబంలో గొడవ ప్రారంభమైంది. భార్యాభర్తలు సతీష్‌, సంగీత మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. ఈ విషయంలో భర్తపై సంగీత మహిళా పోలీసుస్టేషన్‌లో సైతం ఫిర్యా దు చేసినట్లు చెబుతున్నారు. దానికితోడు పెద్ద మనుషుల సమక్షంలో కూడా చర్చించినట్లు తెలిసింది.

Lovers commit suicide on railway tracks

కుటుంబసభ్యులు, పెద్ద మనుషుల సమక్షంలో ఇచ్చిన మాట ప్రకారం సతీష్‌ భార్య, కూతురును తీసుకుని విశాఖపట్నం వెళ్లిపోయాడు. అయినప్పటికీ సింధూరతో సతీష్‌, ప్రేమ వ్యవహారాన్ని కొనసాగిస్తుండటంతో రెండు రోజుల క్రితం భార్యాభర్తల మధ్య తీవ్రమైన గొడవ జరిగినట్లు తెలిసింది. దీంతో కూతురును తీసుకుని సంగీత కాశిబుగ్గలోని అత్తగారింటికి చేరుకుని భర్త ప్రేమ వ్యవహారాన్ని కుటుంబ సభ్యులకు చెప్పి రోదించినట్లు సమాచారం.

కాగా, సింధూర కాలేజీకి పోతున్నానంటూ సోమవారం మధ్యాహ్నం జాన్‌పాకలోని ఇంటినుంచి బయటకు వచ్చినట్లు తెలిసింది. ఏమి జరిగిందో ఏమోగాని మంగళవారం ఉదయం ధర్మారం సమీపంలో రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్న సతీష్‌, సింధూర మృతదేహా లు కనిపించాయి. సంఘటన స్థలంలో సతీష్‌కు చెందిన బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అందులో భార్య సంగీతనుద్దేశించి రాసుకున్న డైరీ దొరికినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. "సింధూరతో కలిసి మన ముగ్గురం కలిసి ఉందామని చెబుతున్నా మీరు ఒప్పుకోవటం లేదు.. ఇద్దరిని బాగా చూసుకుంటానంటున్నా నమ్మటం లేదు.. మా చావుకు ఎవరు కారణం కాద"ని మృతుడు రాసినట్లు జీఆర్‌పీ సీఐ తెలిపారు. ప్రేమికురాలు, భార్యతో కలిసి ఉండటం సాధ్యం కాదనే అభిప్రాయంతోనే సోమవారం అర్ధరాత్రి సతీష్‌, సింధూరలు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుని ఉంటారని జీఆర్‌పీ సీఐ కె.రవీందర్‌ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+