బరితెగించారు.. హైదరాబాద్లో రన్నింగ్ బైక్ పై ఆ పని చేస్తూ.. వీడియో వైరల్!
సమాజంలో యువతలో రోజురోజుకీ నైతిక విలువలు దిగజారి పోతున్నాయి. ఎక్కడ ఏం చేస్తున్నామో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఇటీవల బైక్ పై రొమాన్స్ చేస్తూ ఒక జంట వ్యవహారం వైరల్ కాక తాజాగా హైదరాబాద్లో మరో యువజంట అశ్లీల ప్రవర్తన చూసిన ప్రతి ఒక్కరిని షాక్ కి గురి చేసింది. రన్నింగ్ బైక్‌పై రొమాన్స్ చేస్తూ ఓ జంట చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రన్నింగ్ బైక్ పై నడిరోడ్డుపై యువజంట రొమాన్స్
ఇటీవల కాలంలో యువత, బహిరంగ ప్రదేశాలలో రన్నింగ్ బైకుల పైన అసభ్య ప్రవర్తనతో పబ్లిక్ కు ఇబ్బంది కలిగిస్తున్నారు. ప్రైవేట్ గా చేసే పనిని నడిరోడ్డు మీద చేస్తూ, విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో ఆరాంఘర్ ఫ్లైఓవర్ పైన ఒక యువజంట బరితెగించి చేసిన రొమాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

బైక్ ట్యాంక్ పై ప్రియురాలిని కూర్చోబెట్టుకుని అలా
ఒక యువకుడు బైక్ నడుపుతూ తన ప్రియురాలిని ముందు ట్యాంక్ మీద కూర్చోబెట్టుకొని అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నడిరోడ్డు పైన ఎవరైనా చూస్తారు అన్న భయం, సిగ్గు లేకుండా రెచ్చిపోయిన ఆ జంటకు సంబంధించిన వీడియోను వెనక బైక్ మీద వెళుతున్న ఒక ప్రయాణికుడు సెల్ ఫోన్లో చిత్రీకరించాడు. ఆపై ఈ వీడియో పోస్ట్ చేయడంతో నెటిజన్లు మండిపడుతున్నారు.
బైక్ పై నడిరోడ్డు మీద రొమాన్స్ పై మండిపాటు
రోడ్లపైన వాహనదారులకు ఇబ్బందులు కలిగించేలా జంటలు అభ్యంతరకరంగా వ్యవహరించడం పైన అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం మాత్రమే కాకుండా, సామాజిక విలువలను పాటించని, నైతిక విలువలు లేని యువతకు వారి బాధ్యత రాహిత్యానికి ఇలాంటి ఘటనలు ఉదాహరణ అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డు మీద రొమాన్స్ చేస్తున్న ఈ జంటపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఇటువంటి హేయమైన చర్యలకు పాల్పడే యువత పైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ జంటపైన కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, ఇంకెవరు ఇటువంటి దారుణాలకు పాల్పడకుండా ఉండేలాగా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని వారు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications