నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణాలో లంపీ స్కిన్ కలకలం; వ్యాధి బారిన పశువులు; ఆందోళనలో పాడిరైతులు!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో లంపి స్కిన్ వ్యాధి కలకలం రేపుతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో పశువులు లంపి స్కిన్ వ్యాధి బారిన పడుతున్నాయి. ఉమ్మడి వరంగల్, నిజామాబాద్, జోగులాంబ గద్వాల్ తో పాటు అనేక జిల్లాలలో పశువులలో లంపి స్కిన్ వ్యాధి కనిపిస్తుంది. దీంతో పాడి రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తెల్లజాతి పశువులలో ఎడ్లు, ఆవులు వంటివాటిలో లంపి స్కిన్ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది.

మునుగోడు సిత్రాలు: ఇంటికి కిలో చికెన్.. రాజకీయనాయకుల ప్రేమకు షాక్ అవుతున్న ప్రజలు!!మునుగోడు సిత్రాలు: ఇంటికి కిలో చికెన్.. రాజకీయనాయకుల ప్రేమకు షాక్ అవుతున్న ప్రజలు!!

తెలంగాణాలో లంపీ స్కిన్ వ్యాధి కలకలం

తెలంగాణాలో లంపీ స్కిన్ వ్యాధి కలకలం


ఈ వ్యాధి ఒక పశువు నుండి మరొక పాడి పశువుకు వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో పాడి రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఒక్క వరంగల్ జిల్లాలోనే 57 పాడి పశువుల లంపీ స్కిన్ వ్యాధి సోకింది. నిర్మల్ జిల్లా భైంసా మండలం లో 22 పశువులకు లంపీ స్కిన్ వైరస్ సోకిన ట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఇక నిజామాబాద్ జిల్లాలోని తుంగిని, నలేశ్వర్ గ్రామాలలో ఐదు ఆవులకు ఈ వ్యాధి లక్షణాలు కనిపించాయి. ఎల్లారెడ్డిపేట లో ఒక లేగ దూడ, గద్వాల జిల్లాలో మూడు ఎద్దులు ఈ వ్యాధితో మృతి చెందినట్టు తెలుస్తుంది. అంతేకాదు నిర్మల్ జిల్లాలో టాక్లి, బాబుల్ గాం, కమోల్ లో కూడా పశువులు లంపీ స్కిన్ బారిన పడినట్టు సమాచారం.

 అప్రమత్తమైన పశు వైద్య శాఖాధికారులు

అప్రమత్తమైన పశు వైద్య శాఖాధికారులు


ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో ఈ వైరస్ వేగంగా విస్తరిస్తోంది. హర్యానా, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో ఈ వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోనూ పశువులకు లంపి స్కిన్ వ్యాధి సోకుతుండడంతో పశు వైద్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. లంపి స్కిన్ వ్యాధి సోకిన పశువులను దూరంగా ఉంచాలని, మిగతా పశువులతో కలిపి ఉంచకూడదని సూచిస్తున్నారు. లంపి స్కిన్ వ్యాధి సోకకుండా వ్యాధి వచ్చిన పశువులకు ఐదు కిలోమీటర్ల రేడియస్ లో ఉన్న అన్ని పశువులకు వ్యాక్సిన్లు ఇవ్వాలని సూచిస్తున్నారు.

 వ్యాధి సోకిన పశువుల విషయంలో జాగ్రత్తలు అవసరం

వ్యాధి సోకిన పశువుల విషయంలో జాగ్రత్తలు అవసరం


ఈ వ్యాధి సోకిన పశువులకు వ్యాక్సిన్లు ఇప్పించకూడదని, ఈ వ్యాధి సోకిన పశువులకు వైద్యులు సూచించిన మేరకు జాగ్రత్తలు తీసుకుంటూ, మందులు వాడాలని సూచిస్తున్నారు. లంపీ స్కిన్ వ్యాధి పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. ఇక లంపి స్కిన్ వ్యాధి సోకిన పశువుల నుండి తీసుకున్న పాలు మరగబెట్టిన తర్వాతనే తాగాలని, సంబంధిత పశువులకు పుట్టిన దూడలకు సైతం పాలను వేడి చేసిన తర్వాతనే పట్టాలని అధికారులు చెబుతున్నారు. లంపీ స్కిన్ వ్యాధి పశువుల నుండి మనుషులకు రాదని, ఆపోహలకు గురి కావద్దని అంటున్నారు.

 ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణాకు పశువుల రవాణా నిలిపివేత

ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణాకు పశువుల రవాణా నిలిపివేత


లంపి స్కిన్ వ్యాధి గురించి ఆందోళన పక్కనపెట్టి పశువులు వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, సంబంధిత పశు వైద్య శాఖ అధికారులను సంప్రదించాలని పాడి రైతులకు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే వ్యాధి తీవ్రత నేపధ్యంలో ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణ రాష్ట్రానికి రవాణా అవుతున్న పశువులను చెక్ పోస్టులు ఏర్పాటు చేసి రవాణాను నిలిపివేశారు. ఇక పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ఎక్కడ అయితే లంపీ స్కిన్ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉందో ఆయా గ్రామాల్లో పశువుల సంతలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

English summary
Lumpy skin disease to cattle creates fear in dairy farmers in Telangana. The alerted government took action after the cattle of Warangal, Nizamabad, Nirmal and other districts of the state were affected by lumpy skin disease.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X