"భలే దొరికారుగా..!"- ఈసీని సమర్దించిన 42 మాజీ జడ్డీలకు మధుయాష్కీ కౌంటర్..!
ఎస్ఐఆర్ అక్రమాల ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ, విపక్షాలు, విద్యార్ధి సంఘాలు.. ఇలా ఎవరికి వారు సీఈసీ జ్ఞానేష్ కుమార్ నిరసనలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఈసీకి మద్దతుగా దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన 42 మంది మాజీ న్యాయమూర్తులు ఇవాళ ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. ఇందులో వ్యవస్థలపై గౌరవం ఉంచాలని, ఏదైనా ఉంటే కోర్టుల్లో తేల్చుకోవాలంటూ మాజీ జడ్డీలు రాజకీయ పార్టీలు, నిరసనకారులకు సూచించారు. వీధి నిరసనల వల్ల ఎన్నికల సంఘంపై ఓటర్లలో నమ్మకం పోతోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వృత్తి నిపుణుల విభాగం ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ జాతీయ ఛైర్మన్ గా ఉన్న మధుయాష్కీ గౌడ్ (Madhu Yaskhi) మాజీ న్యాయమూర్తుల లేఖపై వ్యంగ్యంగా స్పందించారు. ఈ బహిరంగ లేఖ రాసినందుకు మీకు ధన్యవాదాలు అంటూ ఆయన ఎక్స్ లో ఓ ట్వీట్ చేశారు. బీజే పార్టీకి (బీజేపీకి) న్యాయమూర్తిగా పనిచేస్తున్నప్పుడు మీరు ఎవరనేది, ఎంత విశ్వసనీయులో తెలుసుకోవాల్సిన అవసరం నుండి మీరు మమ్మల్ని కాపాడారు అంటూ సదరు మాజీ న్యాయమూర్తులకు మధు యాష్కీ చురకలు అంటించారు. తద్వారా న్యాయూర్తులుగా పనిచేసినప్పుడు బీజేపీకి విధేయులుగా ఉన్న వారే ఇవాళ ఈ లేఖ రాసినట్లు ఆయన చెప్పకనే చెప్పారు.

Thank you for writing this open letter; you saved us from having to find out who you were and how loyal you were while serving as a judge to the BJ Party! @INCIndia
— Madhu Goud Yaskhi (@MYaskhi) October 8, 2026
ఇప్పటికే బీజేపీకి అనుకూలంగా దేశంలో వ్యవస్థలన్నీ పనిచేస్తున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇందులో ఈసీతో పాటు పలు న్యాయస్దానాల్లో న్యాయమూర్తులు,వారి తీర్పుల్ని కూడా ప్రస్తావిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఒకేసారి 42 మంది మాజీ న్యాయమూర్తులు ఈసీకి మద్దతుగా నిలుస్తూ బహిరంగ లేఖ రాయడం ద్వారా గతంలో వారు బీజేపీకి అనుకూలంగా పనిచేయడమో లేక విధేయంగా మెలగడమో చేశారన్న అపప్రదను మూటగట్టుకుంటున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అసలే ఢిల్లీ సహా వివిధ నగరాల్లో ఎన్నికల సంఘం నిర్ణయాలపై ఆందోళనలు వెల్లువెత్తుతున్న సమయంలో మాజీ న్యాయమూర్తుల లేఖ కూడా అంతే చర్చనీయాంశంగా మారుతోంది.














Click it and Unblock the Notifications
