ఈసీకి మద్దతుగా 42 మంది మాజీ జడ్డీలు..! నిరసనలపై విసుర్లు..! SIRకు సమర్ధన..!

ఈసీ చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణలో జరిగిన అక్రమాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్రవిమర్శలకు తావిస్తున్నాయి. సీఈసీ తీరుపై మండిపడుతున్న యువత, విపక్షాలు రోడ్లెక్కుతున్నారు. ఈ నేపథ్యంలో ఈసీకి మద్దతుగా 42 మంది వివిధ కోర్టుల్లో పనిచేసి రిటైర్ అయిన మాజీ న్యాయమూర్తులు (Former Judges) రంగంలోకి దిగారు. ఈ మేరకు వారు ఎస్ఐఆర్ తో పాటు ఈసీ నిర్ణయాల్ని సమర్దిస్తూ, ఓట్ల చోరీ ఆరోపణల్ని తప్పుబడుతూ ఓ లేఖ విడుదల చేశారు.

సుప్రీం ఆలస్యానికి దేశం చెల్లిస్తున్న మూల్యం..! రెండేళ్లుగా జరిగింది ఇదీ..?
సుప్రీం ఆలస్యానికి దేశం చెల్లిస్తున్న మూల్యం..! రెండేళ్లుగా జరిగింది ఇదీ..?

ఈ లేఖలో మాజీ న్యాయమూర్తులు.. ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థ, చట్టబద్ధమైన సంస్థలపై నిరంతరంగా దాడి జరుగుతోందని ఆరోపించారు. ఈ మేరకు తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై మాజీ న్యాయమూర్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ సంస్థలను విమర్శించడం ఒక చట్టబద్ధమైన ప్రజాస్వామ్య హక్కేనని పేర్కొన్నారు, కానీ వ్యక్తిగత దాడులు, చట్టబద్ధతను దెబ్బతీసే స్థాయికి వెళ్లవద్దని హెచ్చరించారు. ప్రజా వేదికల నుండి రాజ్యాంగ అధికారులను దొంగలని ముద్ర వేయడం పెరుగుతోందని ఆరోపించారు. అలాగే ఓట్ల దొంగతనం ఆరోపణల ఆధారాన్ని కూడా మాజీ న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఈ ఆరోపణలు కోర్టుల ముందు కాకుండా పత్రికా సమావేశాలలో చేస్తున్నారని వారు ఆక్షేపించారు.

42 Former Judges Defend Election Commission Warn Against Denigration of Poll Panel

ఓట్ల దొంగతనం ఆరోపణలు పత్రికా సమావేశాలలో చేస్తున్నారు, కోర్టుల ముందు కాదు. కమిషన్ ప్రమాణపూర్వక ప్రకటనను కోరినప్పుడు, ఏదీ దాఖలు చేయడం లేదని వారు తెలిపారు. ఎన్నికల ఓటముల తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (EVMs) పదేపదే లక్ష్యంగా చేసుకోవడాన్ని కూడా వీరు ప్రశ్నించారు. అవే యంత్రాలను ఉపయోగించి సాధించిన విజయాలపై మాత్రం ప్రశ్నలు రావడం లేదన్నారు. ఓటర్ల జాబితాలను నియంత్రించే చట్టపరమైన చట్రంలో ఇది ఒక భాగమని వారు తెలిపారు. ఎస్ఐఆర్ ను సమర్ధిస్తూ, ఓటర్ల జాబితాలను సవరించడానికి ఎన్నికల సంఘానికి అధికారం కల్పించే 1950 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 21(3)ను వారు ఈ సందర్భంగా ఉదహరించారు.

42 Former Judges Defend Election Commission Warn Against Denigration of Poll Panel
సీఈసీ నిర్ణయాల్ని సుప్రీం రద్దు చేస్తుందా ? గతంలో ఇందిర సహా 6 ఎన్నికలపై స్టేలు..!
సీఈసీ నిర్ణయాల్ని సుప్రీం రద్దు చేస్తుందా ? గతంలో ఇందిర సహా 6 ఎన్నికలపై స్టేలు..!

ఎన్నికల సంస్థలపై నిరంతరం సందేహాలు వ్యక్తం చేయడం వల్ల కలిగే పరిణామాల గురించి ఆ లేఖలో మాజీ న్యాయమూర్తులు హెచ్చరికలు చేశారు. ప్రజాస్వామ్యానికి నమ్మకమే మూలధనమని, పౌరులకు వారి ఓటుకు విలువ లేదని పదేపదే చెబితే, వారు ఎన్నికల ప్రక్రియపై నమ్మకం కోల్పోవచ్చని హెచ్చరించారు.బ్యాలెట్‌కు అర్థం పోయినప్పుడు, వీధులకు ఆ అర్థం వస్తుందన్నారు. ఒక కథనంతోనే అశాంతి మొదలవుతుందంటూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనాన్ని గుర్తుచేశారు. అప్పుడు ఏర్పడిన శూన్యాన్ని అరాచక, విపరీత శక్తులు ఆక్రమిస్తాయన్నారు. ఎన్నికలను బలహీనపరచడానికి బదులుగా, తమ ఫిర్యాదులను సాక్ష్యాధారాలతో ఎన్నికల సంఘం, కోర్టుల వద్దకు తీసుకువెళ్లాలని సంతకాలు చేసిన మాజీ న్యాయమూర్తులు రాజకీయ పార్టీలను కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+