'ఓటు బచావో - దేశ్ బచావో' నినాదంతో ప్రజా క్షేత్రంలోకి కాంగ్రెస్: మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ(SIR)పై రాజకీయం ఉత్కంఠగా మారింది. ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి ఆరోపిస్తోంది. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ప్రధాన డిమాండ్‌తో దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ లో ఇండియా కూటమి, టీపీసీసీ ఆధ్వర్యంలో 'ఛలో లోక్ భవన్' ర్యాలీ నిర్వహించారు. నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీలో కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

 జెన్‌కో, ట్రాన్స్‌కో ప్రైవేటీకరణపై డిప్యూటీ సీఎం భట్టి చెప్పిందిదే!
జెన్‌కో, ట్రాన్స్‌కో ప్రైవేటీకరణపై డిప్యూటీ సీఎం భట్టి చెప్పిందిదే!

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామిలతో పాటు సీపీఎం, సీపీఐ, టీజేఎస్, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును కాపాడాలని నినాదాలు చేస్తూ సాగిన ర్యాలీ రాజ్‌భవన్‌కు చేరుకోగానే పోలీసులు మోహరించి అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరగడంతో పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పీఎస్ కు తరలించారు.

Fight for Voter Rights Minister Ponnam Prabhakar Calls for Otu Bachao - Desh Bachao Full Details

ఈ క్రమంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో టీపీసీసీ అధ్యక్షుడు, పలువురు రాష్ట్ర మంత్రులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో అర్బులైన ఓటర్ల హక్కులను హరిస్తూ ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడుతున్న బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోందని, ఓటర్ల హక్కుల పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా పోరాటం ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇండియా కూటమి ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతోందని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రతిపక్ష నాయకులను, రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని అప్రజాస్వామిక చర్యగా అభివర్ణిస్తూ తీవ్రంగా ఖండించారు. ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దేశ పౌరులందరిపై ఉందని గుర్తుచేశారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, గిరిజనులు, మైనారిటీలు, బలహీన వర్గాల ఓటు హక్కును కాపాడేందుకు కాంగ్రెస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

'అచ్చే దిన్ కాదది.. వసూల్ రాజ్!': వడ్డీ రేట్లపై విరుచుకుపడ్డ కాంగ్రెస్!
'అచ్చే దిన్ కాదది.. వసూల్ రాజ్!': వడ్డీ రేట్లపై విరుచుకుపడ్డ కాంగ్రెస్!

స్వాతంత్య్ర ఉద్యమ కాలం నుంచే ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడటం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్ నాయకత్వంలో ఓటర్ల హక్కుల పరిరక్షణ ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని, బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. అదే సమయంలో, భారత ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల కమిషన్‌పై ఉందన్న ఆయన, కమిషన్ తన స్వతంత్రతను కాపాడుకోవాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ "ఓటు బచావో - దేశ్ బచావో" అనే నినాదంతో నేరుగా ప్రజల్లోకి వెళ్లనుందని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఓటును కాపాడుకుంటూ రాజ్యాంగాన్ని పరిరక్షించడమే తమ నైతిక బాధ్యతని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు తెలంగాణ ప్రజలందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+