లారీపైనుంచి ఆటోపై పడ్డ గ్రానైట్ రాయి: ముగ్గురు మృతి, మరికొందరికి తీవ్రగాయాలు
హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లా కురవి వద్ద జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న లారీలోని గ్రానైట్ రాయి ఆటోపై పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మరణించారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి.
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆటోలో చిన్నగూడూరు మండలంలోని మంగూరిగూడెం నుంచి కురవికి నూతన సంవత్సర వేడుకల కోసం యువకులు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లారీ మహబూబాబాద్ వైపు నుంచి మరిపెడ వైపు వెళ్తోంది.

కురవి వద్దకు రాగానే రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లారీపై ఉన్న గ్రానైట్ రాళ్లు ఆటోపై పడటంతో ఆటోలో ప్రయాణిస్తున్నవారు రాళ్ల కిందపడి మృతి చెందారు. గ్రానైట్ రాయి కింద పడిన మృతదేహాలను జేసీబీ సాయంతో బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు, పరారైన లారీ డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
మృతులు మరిపెడ మండలం మంగోరిగూడెం గ్రామస్థులుగా పోలీసులు పేర్కొన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications