జూబ్లీహిల్స్ వ్యవహారంలో అనూహ్య మలుపు: తెరపై మాగంటి గోపీనాథ్ తల్లి
Jubilee Hills bypoll: తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కీలకంగా మారింది. మూడు పార్టీలకూ అగ్నిపరీక్ష పెడుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ.. ఈ నియోజకవర్గంపై కన్నేశాయి. దీన్ని హస్తగతం చేసుకోవడానికి పోటీ పడుతున్నాయి. పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ ప్రచార వేడి పెరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారంటే.. ఈ ఎన్నికను ఆ పార్టీ ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు.
బీఆర్ఎస్ శాసన సభ్యుడు మాగంటి గోపీనాథ్ కన్నుమూత వల్ల ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అవసరమైన విషయం తెలిసిందే. ఈ నెల 11వ తేదీన పోలింగ్ జరుగనుంది. 14వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఇప్పటికే నామినేషన్ల పర్వం మొత్తం ముగిసింది. ఆయా పార్టీలన్నీ ప్రచారబరిలో దిగాయి. సిట్టింగ్ బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత, కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు.

పోలింగ్ సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో మాగంటి గోపీనాథ్ మృతిపై అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. గోపీనాథ్ మరణంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ ఆయన తల్లి మహానంద కుమారి రాయదుర్గం పోలీసులకు లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు. గోపీనాథ్ మరణంపై అనుమానాలు ఉన్నాయని తెలిపారు. గోపీనాథ్ మరణంపై విచారణ జరిపించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో ప్రకటించిన మరుసటి రోజే ఈ ఫిర్యాదు అందింది.
తన కుమారుడు ఆసుపత్రిలో ఉన్నప్పుడు సంరక్షణ బాధ్యత వహించిన వ్యక్తుల నిర్లక్ష్యం, మితిమీరిన జోక్యం చోటు చేసుకుందని మహానంద కుమారి ఈ ఫిర్యాదులో పొందుపరిచారు. మూత్రపిండాల సమస్యలకు చికిత్స కోసం ఈ ఏడాది జూన్ 5న ఆసుపత్రిలో చేరగా.. జూన్ 8న ఆయన మరణించినట్లు ప్రకటించారని గుర్తు చేశారు. గోపీనాథ్ ఐసీయూలో ఉన్నప్పుడు ఆసుపత్రి సిబ్బంది తనను చూడటానికి అనుమతించలేదని ఆరోపించారు.
సునీత కుమార్తెగా తన ఫిర్యాదులో పేర్కొన్న దిషిరా అనే మహిళ రాతపూర్వక ఆదేశాల మేరకే ఆసుపత్రి సిబ్బంది తనను అడ్డుకున్నారని వివరించారు. గోపీనాథ్ మరణించిన తర్వాత కూడా తనను చూడటానికి నిరాకరించారని మహానందకుమారి ఆరోపించారు. మూత్రపిండాల వైఫల్యం, పెరుగుతున్న క్రియేటినిన్ స్థాయిల కారణంగా తన కుమారుడి పరిస్థితి క్షీణించిందని, సమయానికి సరైన వైద్య సహాయం అందలేదని అన్నారు.
ఒక కిడ్నీని తొలగించిన తర్వాత డయాలసిస్ ప్రారంభించడంలో నిర్లక్ష్యం కనిపించిందని, ఇది క్రియేటినిన్ స్థాయి మరింత పెరగడానికి కారణమైందని పేర్కొన్నారు. కేటీఆర్ పేరును తన ఫిర్యాదులో ప్రస్తావించారు. తల్లిని చూడటానికి అనుమతించనప్పుడు గోపీనాథ్ ను చూడటానికి కేటీఆర్ కు ఎలా అనుమతి ఇచ్చారని అన్నారు. తనను బయటే ఉంచి, కేటీఆర్ తన కుమారుడిని కలవడానికి అనుమతించారని, ఆ తర్వాత, ఏదీ మాట్లాడకుండానే వెళ్లిపోయారని అని ఫిర్యాదులో రాశారు.
ఇది తన కుమారుడి చికిత్స విషయంలో ఇది దురుద్దేశపూరక లేదా మోసపూరిత జోక్యం అని వ్యాఖ్యానించారు. గోపీనాథ్ వ్యక్తిగత సిబ్బంది, గన్‌మెన్‌లు సైతం తమ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని మహానంద కుమారి ఆరోపించారు. గోపీనాథ్ కుప్పకూలినప్పుడు వారు అక్కడ లేరని, అత్యవసర సహాయం అందించడంలో విఫలమయ్యారని ఆమె పేర్కొన్నారు. గోపీనాథ్ ల్యాబొరేటరీ, హిస్టోపాథాలజీ రిపోర్టులు, రాడికల్ నెఫ్రెక్టమీ, మూత్రపిండాల క్యాన్సర్ నిర్ధారణకు సంబంధించిన ప్రిస్కిప్షన్లు జతచేశారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications