జబ్బు నయం చేస్తామని వివాహితపై గ్యాంగ్‌రేప్: దృశ్యాల రికార్డింగ్, బెదిరింపులు

ఆదిలాబాద్: అనారోగ్యంతో ఉన్న మహిళకు నయం చేస్తామని నమ్మించి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది.బాధితురాలి అర్దనగ్న దృశ్యాలు, వీడియోలను ఆమె ఫోన్‌కు పంపించి డబ్బులు డిమాండ్ చేశారు.ఈ వేధింపులు భరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో ఓ వివాహితపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు కొందరు వ్యక్తులు. మహారాష్ట్రలోని ఔరంగబాద్‌లోని భరత్‌నగర్‌కు చెందిన ఓ వివాహితకు ఆరోగ్యం బాగాలేదు. అయితే ఆదిలాబాద్ జిల్లాలోని ఓ బాబా వద్దకు వెళ్తే నయం అవుతోందని తెలిసి ఆమె అక్కడే ఓ బాబాను ఆశ్రయించింది.

అయితే తనకు తెలిసిన ఓ బాబా వద్దకు వెళ్తే వ్యాధి నయమయ్యే అవకాశం ఉందని బాధితురాలని ఆ బాబా నమ్మించాడు. ఆ బాబా మాటలు నమ్మిన ఆమె అతడితో పాటే ఆదిలాబాద్ జిల్లాలోని ఓ బాబాను ఆశ్రయించింది.

 నమ్మించి నయవంచన

నమ్మించి నయవంచన

మహారాష్ట్రలోని ఔరంగబాద్‌లోని భరత్‌నగర్‌కు చెందిన వివాహితను స్థానికంగా ఉన్న ఓ బాబా తన గురువైన ఆదిలాబాద్ జిల్లా చాంద గ్రామానికి తీసుకొచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత ఆమె ఆరోగ్యం కొంత నయమైంది. కొంత కాలానికి తిరిగి వ్యాధి తీవ్రం కావడంతో ఆమె బాబాను ఆశ్రయించింది. దీంతో ఏప్రిల్ 8వ తేదిన వివాహితను ఆదిలాబాద్ జిల్లా చాంద గ్రామానికి తీసుకొచ్చాడు బాబా అక్కడే పథకం ప్రకారంగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

పూజల పేరుతో రేప్ చేశారు

పూజల పేరుతో రేప్ చేశారు

వివాహితను చాంద గ్రామానికి తీసుకొచ్చిన బాబా అక్కడే ఉన్న మరో ఇద్దరితో కలిసి బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. దర్గాకు సమీపంలోని చెట్టు వద్ద పూజలు చేయాలని చెప్పి బాధితురాలిని పంపారు. పూజలు చేస్తున్న బాధితురాలిపై ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. బాధితురాలు ఎంత బతిమిలాడినా కానీ నిందితులు మాత్రం వదల్లేదు.

అశ్లీల దృశ్యాల చిత్రీకరణ

అశ్లీల దృశ్యాల చిత్రీకరణ


పూజ చేస్తున్న సమయంలో బాధితురాలిపై అత్యాచారానికి దిగిన ముగ్గురు నిందితులు ఆ దృశ్యాలను తమ సెల్‌ఫోన్‌లో రికార్డు చేశారు. అక్కడి నుండి మహరాష్ట్రకు తిరుగు ప్రయాణమయ్యే సమయంలో మహారాష్ట్రలోని మహోర్ వద్ద కారులోనే బాధితురాలిపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఈ సమయంలో కూడ ఆ దృశ్యాలను రికార్డు చేశారు. మహారాష్ట్రలోని ఔరంగబాద్‌లోని భరత్‌నగర్‌కు చెందిన వివాహితను స్థానికంగా ఉన్న ఓ బాబా తన గురువైన ఆదిలాబాద్ జిల్లా చాంద గ్రామానికి తీసుకొచ్చారు.

బాధితురాలి వద్ద డబ్బులు డిమాండ్

బాధితురాలి వద్ద డబ్బులు డిమాండ్

గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన నిందితులు ఆ దృశ్యాలను వివాహిత సెల్‌ఫోన్‌కు పంపారు. తమకు రూ.25వేలు ఇవ్వకపోతే ఆ దృశ్యాలను బయటపెడతామని బ్లాక్ మెయిల్ చేశారు. ప్రతి రోజూ ఈ విషయమై నిందితుల నుండి ఈ వేధింపులు ఎక్కువ కావడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆదారంగా పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+