రాత్రికి రాత్రే పరిష్కారంకాదు, కెటిఆర్‌తో కలిసి మహేష్ బాబు వస్తారు: నమ్రత
మహబూబ్ నగర్: సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ శుక్రవారం నాడు తాము దత్తత తీసుకున్న సిద్ధాపూర్ గ్రామాన్ని సందర్శించారు. మహేష్ బాబు కొద్ది రోజుల క్రితం మహబూబ్ నగర్ జిల్లాలోని సిద్ధాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.
ఈ గ్రామంలో నమ్రతా శిరోద్కర్ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. త్వరలో మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, మహేష్ బాబులు గ్రామాన్ని సందర్శిస్తారని చెప్పారు. కలెక్టర్ ఇతర అధికారులతో అభివృద్ధి పనుల విషయమై చర్చిస్తున్నామని చెప్పారు. రాత్రికి రాత్రే సమస్యలు పరిష్కారం కావని, ఒక్కటొక్కటిగా సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.

ఇటీవల గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెంలో గల్లా జయదేవ్ భార్యతో కలిసి పర్యటించి గ్రామస్థుల సమస్యలు తెలుసుకున్నారు. ఇప్పుడు నమ్రతా శిరోద్కర్ ఈ రోజు సిద్ధాపూర్ గ్రామంలో పర్యటించారు. గ్రామస్తులను సమస్యలు అడిగి తెలుసుకున్నరు. తాము దత్తత తీసుకున్న గ్రామాన్ని మోడర్న్ గ్రామంగా, స్మార్ట్ విలేజ్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు.
దత్తత కాన్సెప్టుతో తెరకెక్కిన మహేష్ బాబు శ్రీమంతుడు చిత్రం విజయం సాధించిన విషయం తెలిసిందే. శ్రీమంతుడు సినిమా తర్వాత మహేష్ బాబు రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఏపీలో గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెం గ్రామాన్ని, తెలంగాణలో సిద్ధాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications