వ్యూహాత్మక తప్పిదం: పవన్ కల్యాణ్‌పై మళ్లీ 'కత్తి' దూశాడు

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సినీ క్రిటిక్ మహేష్ కత్తి మరోసారి వ్యాఖ్యలు చేశారు. సరెండర్ కాబోనని చెప్పిన ఆయన పవన్ కల్యాణ్ తెలంగాణ పర్యటనపై ఈసారి వ్యాఖ్యానించారు.

Recommended Video

    జై తెలంగాణ అంటూ పవన్ ఉద్వేగం : తెలంగాణ కోసం నా రక్తం ఇస్తా !

    వ్యక్తిగత విమర్శలు, వ్యాఖ్యలు చేయబోనని మహేష్ కత్తి పవన్ కల్యాణ్ అభిమానులకు మాట ఇచ్చారు. అయితే, అప్పటి నుంచి మౌనంగానే ఉంటూ వచ్చిన ఆయన తాజాగా వ్యాఖ్యానించడం ద్వారా మరోసారి వివాదానికి కారణవుతారా అనే సందేహం కలుగుతోంది.

     పవన్ కల్యాణ్ ఇలా చెబుతున్నారు...

    పవన్ కల్యాణ్ ఇలా చెబుతున్నారు...

    తెలంగాణ పసిబిడ్డ అని, ఆ బిడ్డను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉందని పవన్ కల్యాణ్ అనడాన్ని ప్రస్తావిస్తూ ఆయన తెలంగాణలో పర్యటించడాన్ని వ్యూహాత్మకంగా తప్పిదంగా మహేష్ కత్తి అభిప్రాయపడ్డారు.

    పవన్ కల్యాణ్ అవసరం అక్కడే...

    పవన్ కల్యాణ్ అవసరం అక్కడే...

    పవన్ కల్యాణ్ అవసరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఉందని, తెలంగాణలో పార్టీ కార్యకర్తల బేటీ ప్రారంభించడం పవన్ కల్యాణ్ వ్యూహాత్మక తప్పిదమని ఆయన ట్వీట్ చేశారు.

    కత్తి యుద్ధం ముగిసింది...

    కత్తి యుద్ధం ముగిసింది...

    పవన్ కల్యాణ్ అభిమానులకు, కత్తి మహేష్‌కు మధ్య నాలుగు నెలల పాటు నిర్విరామ సమరం సాగింది. అది వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత ఆరోపణల స్థాయికి కూడా వెళ్లింది. ఈ స్థితిలో పరిస్థితి దారుణంగా తయారైంది. ఆ సమయంలో కోన వెంకట్ వంటివాళ్లు కల్పించుకని సమస్య పరిష్కారానికి కృషి చేశారు.

     మహేష్ కత్తితో చేయి చేయి కలిపి...

    మహేష్ కత్తితో చేయి చేయి కలిపి...

    సమరానికి స్వస్తి పలకడానికి ముందుకు వచ్చిన మహేష్ కత్తికి ఓ టీవీ చానెల్‌లో పవన్ కల్యాణ్ అభిమానులు శాలువా కప్పి సన్మానం కూడా చేశారు. మహేష్ కత్తిని ప్రశంసించారు కూడా. అంతా సానుకూలమైందని అనుకుంటున్న సమయంలో మహేష్ కత్తి తాజాగా చేసిన వ్యాఖ్య ఎటు దారితీస్తుందనేది వేచి చూడాల్సిందే.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+